అక్రమ నిర్మాణాలపై HMDA కొరడా.. కూల్చివేస్తున్న భవనం..

అక్రమ నిర్మాణాలపై HMDA కొరడా.. కూల్చివేస్తున్న భవనం..

రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై కొరడా విసిరారు అధికారులు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. 2,3 ఫ్లోర్ కు అనుమతి తీసుకుని 6,7 అంతస్తులు నిర్మిస్తున్న ఇంటి యజమానులపై చర్యలు తీసుకున్నారు.  గౌలిదొడ్డిలో అనుమతులు లేని నిర్మాణాన్ని హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. 

2,3 ఫ్లోర్ కు అనుమతి తీసుకుని 6,7 అంతస్తులు నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. 6,7 అంతస్థులలో గ్యాస్ కట్టర్ ద్వారా స్లాబులను  తొలగిస్తున్నారు.   ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బంధబస్తీ మద్య  అధికారులు కూల్చివేస్తున్నారు.