Holi Wishes : హోలీ బెస్ట్ విషెస్ చెప్పండి ఇలా

Holi Wishes : హోలీ బెస్ట్ విషెస్ చెప్పండి ఇలా

ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున 'కామ దహనం'... పౌర్ణమి రోజు హోలీకా పూర్ణిమ (కాముని పున్నమి) పేరుతో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, బెజవాడ వంటి నగరాల్లో మన తెలుగు వారు ఈ హోలీ సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకుంటారు. కులాలు, మతాలకు అతీతంగా పెద్దలు కూడా పిల్లలుగా మారి.. ఆనందంతో కేరింత లు కొట్టే పండుగ ఒక్క హోళీ మాత్రమే.. 

 

 

హోలీ బెస్ట్ విషెస్.. 

  •  హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు కాదు.. అనురాగాలు, ఆప్యాయతలు. అందరికీ హోళీ శుభాకాంక్షలు
  • అన్ని రంగులు కలిసి ఉంటేనే అందం.. అందరూ కలిసి ఉంటేనే జీవితానికి అందం.. హ్యాపీ హోలీ
  • సంబరాల రంగుల పండుగ.. హోలీ శుభాకాంక్షలు
  • సుఖం, దుఖం, సంతోషాలకు ప్రతీక ఈ రంగుల పండగ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
  • చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ.. అందరికీ హ్యాపీ హోలీ
  • రంగుల పండగ హోలీ.. మీ జీవితాన్ని రంగులతో నింపాలని కోరుకుంటూ హ్యాపీ హోలీ
  •  ఈ హోలీ నాడు మీ కష్టాలన్నీ తొలగిపోవాలి.. మీ జవితం రంగులమయం కావాలని కోరుకుంటూ హ్యాపీ హోలీ
  •  ఈ రంగుల పండగ మీ జీవితంలో అభివృద్ధి, సంపద, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ హోలీ
  • హోలీ అనేది రంగులు మాత్రమే కాదు.. మన జీవితానికి ప్రతి క్షణం కలర్ ఫుల్ గా ఉండాలనే సందేశం కూడా ఇస్తోంది.. హ్యాపీ హోలీ
  • ఈ హోలీ నుంచి మీ జీవితం రంగుల మయం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ హ్యాపీ హోలీ.
  •  రోజులు మారుతూ ఉంటాయి.. రంగులు అలాగే ఉంటాయి.. మీ జీవితం కూడా హోలీ రంగుల్లా.. కలర్ ఫుల్ గా ఉండాలి.. హ్యాపీ హోలీ
  •  చీకటిలో ఏ రంగూ కనిపించదు.. అలాగే కష్టాల్లో ఏ దారీ కనిపించదు.. జీవితంలో చీకట్లను తరిమేసేలా రంగులను ఆహ్వానించండి.. హ్యాపీ హోలీ
  • హోలీ అంటే రంగులమయం.. అన్ని రంగులు జీవితం ఉండేలా సంపూర్ణం చేసుకోవాలి.. హ్యాపీ హోలీ
  •  ప్రతి పండగ రేపటిపై ఆశల్ని చిగురింపజేస్తుంది.. హోలీ ఆ ఆశలను రంగులతో నింపి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.. హ్యాపీ హోలీ
  •  హోలీ ప్రేమికులకే కాదు.. ప్రతి ఒక్కరికీ ఆనందాల పండుగ. దాన్ని ఆస్వాదించాలి.. కలర్ పుల్ గా జరుపుకోవాలి.. 
  •  సప్త వర్ణాల శోభితమైన పండుగ, సలక్షణమైన సండగ.. వసంత శోభతో పరిడవిల్లే నూతలన వేడుక, రంగుల కేళీ.. హోళీ పండగ శుభాకాంక్షలు
  • చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ హోళీ.. సుఖం, దుఖం, సంతోషం, విచారం అన్నీ కలిసిన రంగులే హోలీ.. రాగ ద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్క చోట చేర్చే రంగుల పండుగే హోళీ.. హ్యాపీ హోలీ