రంగుల పండుగ హోలీని ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసా?!

రంగుల పండుగ హోలీని ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసా?!

హోలీ  పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి.  వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. చెడుపై మంచి విజయానికి సూచిక.  ఈ ఏడాది మార్చి 25, సోమవారం హోలీ జరుపుకుంటాం.  హోలీని దేశంలోని ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా జరుపుకుంటారు. ఏయే ప్రదేశాలలో హోలీని ఎలా జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకోండి.

 హోలీ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన హిందూ పండుగలలో ఒకటి. అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంతో, సంతోషకరమైన వాతావరణంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం, హోలీని మార్చి 8న జరుపుకుంటున్నారు. ఈ పండుగను సాధారణంగా 'రంగుల పండుగ' (Festival of Colors) అని పిలుస్తారు. ఆ రోజున  ( మార్చి 25) అందరు ఒకరికొకరు రంగులను పూసుకుంటూ రంగులమయంగా మారతారు. ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చే, సామరస్యాన్ని పెంపొందించే, ఆనందాన్ని పంచే పండుగ. ఆనందంగా వేడుకలు జరుపుకునే ప్రతీ పండుగలాగే ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం కూడా చెడుపై మంచి విజయం సాధించడం. అవి విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల మేళవింపుతో అసలైన భారతీయతను చాటుతాయి.

  తెలంగాణ... కామదహనం

హోలీకి కొన్నిరోజుల ముందు నుండే తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు, యువకులు కలిసి ఒక బృందంగా ఏర్పడతారు. వారు ఇంటింటికి తిరుగుతూ 'రింగీస్ బిల్లా రూపాయి దండ' అంటూ కోలాటం ఆడుతూ చందాలు వసూలు చేస్తారు.  హైదరాబాద్ లోనూ హోలీ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. హోలీ ఫెస్టివల్స్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి.హోలీకి ఒకరోజు ముందు ( మార్చి 24 అర్దరాత్రి) చూరస్తాల్లో కర్రలు పేర్చి కామదహనం నిర్వహిస్తారు. ఇది సంక్రాతి భోగి మంటలను తలపిస్తుంది. ఆ తర్వాత రోజు ( మార్చి 25)  రంగులు పూసుకుంటూ హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.

ఉత్తర్ ప్రదేశ్‌

యూపీ,మథురలోని బర్సానా లత్మార్ హోలీకి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ఈ హోలీ వేడుకలు ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. స్త్రీలు సంప్రదాయబద్ధంగా గోపికల వేషధారణతోనూ, పురుషులు గో పురుషులుగానూ మారి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. మథురలోని రాధా కృష్ణుల ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతారు. భజనలు, సంకీర్తనలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి.  స్థానికులు మాత్రమే కాదు,  విదేశీయులు కూడా  ఇక్కడ హోలీ వేడుకలతో సందడి చేస్తుంటారు. 

బృందావన్ లో .. పూలతో హోలీ

యూపీలోని బృందావన్ పట్టణంలో పూలతో హోలీ జరుపుకుంటారు. అందుకే దీనిని ‘ఫూల్ వాలీ హోలీ’ లేదా ‘ఫూలోన్ కి హోలీ’ అంటారు. ఇక్కడ హోలీ వేడుక వారం రోజుల పాటు  సాగుతుంది.  ఇక్కడి స్థానిక బాంకే బిహారీ ఆలయంలో కృష్ణ భక్తులు ఒకరిపై ఒకరు పూల రేకులు చల్లుకుంటూ హోలీ ఆడతారు. సాయంత్రం వేళలోఆలయ పూజారులు ఆలయాన్ని సందర్శించే భక్తులపై పూల వర్షం కురిపిస్తారు. బృందావన్‌లోని బాంకీ బిహారీ ఆలయం  ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీ అనేది ఒకరోజు కార్యక్రమం కాదు. రంగుల్లో మునిగి తేలడంతోపాటు,పురాణ ఇతిహాసాలు, స్థానిక జానపద కథల  ప్రస్తావనలతో వారం పాటు వేడుక  కొనసాగుతుంది. 

లాత్మార్ హోలీ, బర్సానా -నంద్‌గావ్

శ్రీకృష్ణుని జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన మధురలోనూ...  లాత్మార్ హోలీ, ఫూల్ వాలీ హోలీ అంటూ భిన్న రూపాలలో హోలీ జరుపుకుంటారు. హోలీ వేడుకలకు మధుర చాలా ప్రసిద్ధి. దేశం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడకు హోలీ ఆడటానికి వస్తారు. సాయంత్రం వేళలో  నాటకాల ప్రదర్శన కూడా ఉంటుంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బర్సానా, నంద్‌గావ్ అనే రెండు పట్టణాలు ఈ రకమైన హోలీ వేడుకలకు ప్రసిద్ధి. బర్సానా రాధ స్వస్థలంగా పేర్కొంటారు. లాత్మార్ హోలీ వేడుకలు ఇక్కడ చాలా సరదాగా ఉంటాయి, ఈ వేడుకల్లో పాల్గొనాలని చాలా మంది ఉత్సాహం చూపుతారు. శ్రీకృష్ణుడు అతడి స్నేహితులు కలిసి హోలీ ఆడటానికి నందగావ్ నుండి బర్సానా సందర్శించినప్పుడు అక్కడి గోపికలతో వారు చిలిపి పనులు, కొంటె పనులు చేయగా.. వారు కర్రలతో కొట్టడానికి వస్తే...  శ్రీకృష్ణుడు, స్నేహితులు తప్పించుకుంటూ ఆడే హోలీ ఆటలు సరదాగా సాగుతాయి. ఇదే నేపథ్యంలోనే ప్రతీ సంవత్సరం బర్సానా -నంద్‌గావ్ హోలీ వేడుకలు జరుగుతాయి. మగవారు హోలీ ఆడటానికి వెళ్తే, ఆడవారు కర్రలతో వస్తారు. వారిని తప్పించుకుంటూ తిరగాలి.

పశ్చిమ బెంగాల్​...బసంత్ ఉత్సవ్..... శాంతినికేతన్​ 

పశ్చిమ బెంగాల్‌, బోల్పూర్‌లో ఉన్న శాంతినికేతన్‌ హోలీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.  బెంగాలీలు హోలీని  బసంత ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. .  దీనినే వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. . శాంతినికేతన్ యూనివర్శిటీలో వేడుకలు ఘనంగా జరుగుతాయి. రవీద్ర భారతి యూనివర్శిటీలో నోబెల్ గ్రహీత రవీద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను నిర్వహించడం మొదలెట్టారట  హోలీ వేడుకలకు ఇక్కడ ప్రత్యేకంగా పసుపు రంగును మాత్రమే వినియోగిస్తారు. పసుపు దుస్తులు ధరిస్తారు. ఈ ప్రేరణతోనే సాధారణ వేడుకలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి.

పంజాబ్ ... హోలా మొహల్లా, అమృత్ సర్​ 

పంజాబ్‌లో హోలీ పండుగను హోలా మొహల్లాగా జరుపుకుంటారు.  హోలా మొహల్లా అనేది సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ మార్గదర్శకత్వంలో జరిగే ఒక సంప్రదాయ తంతు .  ... యుద్ధ-నైపుణ్యాల సాధన  అని అర్థం.  ఇందులో భాగంగా నిహాంగ్ సిక్కులు యుద్ధ కళల ద్వారా తమ శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కుస్తీ, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ విన్యాసాలు ఉంటాయి.  ఇక్కడ హోలీ వేడుకల్లో  కత్తులతో విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నిహాంగ్ సిక్కులు ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీని పౌరుషానికి ప్రతీకగా, ధైర్యవంతుల హోలీగా వేడుక చేసుకుంటారు.   

మణిపూర్ ,యయోసాంగ్

మణిపూర్‌లో హోలీ పండుగను స్థానిక యయోసాంగ్ పండుగతో సమానంగా నిర్వహిస్తారు. జానపద నృత్యాలు, సంగీత కచేరీలు, భోగి మంటలు, క్రీడా కార్యక్రమాలు, రంగులతో ఆడుకోవడంతో సహా ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

ఉదయపూర్, రాజస్థాన్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనూ హోలీ వేడుకలకు పెట్టింది పేరు. అక్కడ ఉండే మేవార్ రాజ వంశస్థులు ఈ పండుగను హోలికా దహన్ కార్యక్రమంతో ప్రారంభిస్తారు. రాజస్థాన్‌లోని  పుష్కర్‌లో కూడా హోలీ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు.  రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు,  సంప్రదాయ నృత్య  ప్రదర్శనలతో ఉత్సాహంగా  హోలిని జరుపుకుంటారు.

ALSO READ :- నేను బీజేపీతో టచ్లో ఉన్నాను అనడం కరెక్ట్ కాదు : మంత్రి పొంగులేటి

 దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై నగరాల్లో  కూడా  హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణాలో చిన్నా, పెద్ద అంతా,ముఖ్యంగా యువత ఈ  రంగుల హోలీని బాగా  ఎంజాయ్‌ చేస్తారు.  హోలి అంటే వివిధ రకాల రంగులు, చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు.  ప్రతీ రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే  షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్‌లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్‌లు నిండిపోతాయి.  రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం  ఒక ఆనవాయితీ.  మన దేశంలోని కొన్ని చోట్ల అత్యంత ఘనంగా జరుపుకుంటారు.