ఎన్నికల క్రమంలో.. ఉద్యోగుల సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం

ఎన్నికల క్రమంలో.. ఉద్యోగుల సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం

దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి, ఇప్పటికే ఎన్నికల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది.మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగున్నాయి.  ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్రమంలో  దేశవ్యాప్తంగా కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. 

 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సెలవులపై నిషేధం విధించారు. ఈ మేరకు  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ ఉద్యోగులకుసాధారణ సెలవులు రద్దు చేశారు.  అత్యవసరమైతే రెండు రోజుల వరకు అనుమతించేందుకు కార్యాలయ అధికారికి అధికారం ఉంటుంది.  ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.  ఆరోగ్య పరంగా ఇబ్బందులు వస్తే  ప్రభుత్వ ఉద్యోగి దరఖాస్తుతో పాటు మెడికల్​ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్​ జతచేసి సమర్పించాలి. కార్యాలయ అధిపతి ద్వారా జిల్లా ఎన్నికల అధికారి సమర్పించితే ఆయన అనుమతితో సెలవు తీసుకోవచ్చు. 

ఎన్నికలకును సంబందించిన ఆర్డర్లు, మెయిల్స్​ .. ఇతర సమాచారం అందించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెలవు రోజుల్లో కూడా పని చేయాలని  జిల్లా ఎన్నికల అధికారులు​ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయి.