అక్టోబర్ 14 నుంచి 24 వరకు సెలవులు..

అక్టోబర్ 14 నుంచి 24 వరకు సెలవులు..

తెలంగాణలో దసరా పండగల సెలవులు ప్రకటించింది ఉస్మానియా యూనివర్సిటీ. బతుకమ్మ, దసరా పండగలను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 14వ తేదీ నుంచి 24 తేదీ వరకు సెలవులు ఉంటాయని ఉస్మానియా యూనివర్సిటీకి వెల్లడించింది. 

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు అక్టోబర్ 14 వ తేదీ నుంచి 24 వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. UG,PG కాలేజీల విద్యార్థులు దసరా, బతుకమ్మ సెలవులు వర్తిస్తాయి.  10 రోజుల సెలవుల అనంతరం ఓయూ  క్యాంపస్ తో పాటు..ఓయూ అఫిలియేటడ్ కాలేజీలన్నీ తిరిగి అక్టోబర్ 25వ తేదీన తెరబడతాయని పేర్కొంది. 

ALSO READ: పేరంట్స్ షాక్ : 13 ఏళ్ల పిల్లోడు.. స్కూల్ లో PT చేస్తూ చనిపోయాడు
 


మరోవైపు దసరా, బతుకమ్మ పండగలను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 13 నుంచి 23 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలె ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవు దినాన్ని అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా సెలవు దినాల్లో మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.