IND vs AUS: బౌలర్లకు దడ పుట్టిస్తున్న ఇండోర్ పిచ్.. 400 కొట్టినా నో గ్యారంటీ..

IND vs AUS: బౌలర్లకు దడ పుట్టిస్తున్న ఇండోర్ పిచ్.. 400 కొట్టినా నో గ్యారంటీ..

ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే చాలు భారీ స్కోర్ ఖాయం చేసుకోవడమే. బ్యాటర్లకు స్వర్గధామంగా ఉన్న ఈ పిచ్ గత చరిత్ర చూసుకుంటే బౌలర్లలో వణుకు పుట్టాల్సిందే. 2006 లో తొలిసారి ఈ స్టేడియంలో ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ దగ్గర నుంచి ఈ ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ వరకు బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఇదిలా ఉండగా.. నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఇండోర్ స్టేడియంలోని జరగబోతుంది.

పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?

సహజంగా ఇండోర్ పిచ్ అంటే బ్యాటింగ్ కే అనుకూలిస్తుంది. ఈ వికెట్ పై నేడు భారీ స్కోర్లు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ వికెట్ పై ప్రారంభంలో కాస్త బౌన్స్ ఉండడం సానుకూలాంశం. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.రెండు జట్లలో కూడా భారీ హిట్టర్లు ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసి 400 కొట్టినా గ్యారంటీ లేదని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తన్నారు. 

కాగా.. ఇండోర్ స్టేడియంలో ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 385 స్కోర్ చేసి న్యూజిలాండ్  90 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్, గిల్ సెంచరీల మోత మోగించారు. ఇక 2011 లో వీరేంద్ర సెహ్వాగ్ వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ కూడా ఈ మైదానంలోనే చేసాడు.