SSRMB: మహేష్ మూవీ కోసం రంగంలోకి జేమ్స్ కామెరూన్.. భారీ స్కెచ్ వేసిన జక్కన్న

SSRMB: మహేష్ మూవీ కోసం రంగంలోకి జేమ్స్ కామెరూన్.. భారీ స్కెచ్ వేసిన జక్కన్న

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్(RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్థార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రతీ ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కథా పనులు పూర్తవడంతో.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుమొదలయ్యని. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. 

అయితే ఈ సినిమా ఓపెనింగ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్ వేశాడట. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(James Cameron) తో ఈ సినిమాను మొదలుపెట్టాలని చేస్తున్నాడట. దాంతో ఇంటర్నేషనల్ వైడ్ ఈ సినిమాపై హైప్ అండ్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవుతుందని చూస్తున్నాడట జక్కన్న. ఇక ఈ సినిమా ప్రపంచదేశాల్లో కూడా రిలీజ్ కాబోతోంది కాబట్టి అలా కూడా ప్లస్ అవుతుందని చూస్తున్నాడట. ఇవన్నీ బాగానే ఉన్నా.. రాజమౌళి కోసం జేమ్స్ కామెరూన్ వస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

నిజానికి ఆర్ఆర్ఆర్ హిట్ తరువాత జేమ్స్ కామెరూన్ రాజమౌళికి అభిమానిగా మారిపోయాడు. అంతేకాదు చాలా వేదికల్లో ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, దర్శకుడు రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడాడు. దాంతో రాజమౌళి గనక ఆయన్ని ఇన్వైట్ చేస్తే తప్పకుండా వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి నిజంగా రాజమౌళి తన నెక్స్ట్ సినిమా కోసం జేమ్స్ కామెరూన్ ను పిలుస్తారా చూడాలి. ఒకవేళ రాజమౌళి పిలిచి, జేమ్స్ కామెరూన్ వచ్చారంటే మాత్రం ఒక హాలీవుడ్ దర్శకుడి చేత మొదలైన తెలుగు సినిమాగ కూడా మహేష్, రాజమౌళి మూవీ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం.