#GHOSTLOVE: ప్రేమించు.. ధైర్యం ఉంటే.. ఆసక్తికరంగా లవ్ మీ మోషన్ పోస్టర్

#GHOSTLOVE: ప్రేమించు.. ధైర్యం ఉంటే.. ఆసక్తికరంగా లవ్ మీ మోషన్ పోస్టర్

రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు యంగ్ హీరో ఆశిష్ రెడ్డి(Ashish Reddy). ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) సోదరుడు శిరీష్(Shirish) కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచుకున్నాడు. సినిమా మాత్రం ఆశించినంత సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత వెంటనే సెల్ఫీష్ అనే సినిమాను మొదలుపెట్టాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా మరో సినిమాను మొదలుపెట్టారు హీరో ఆశిష్ రెడ్డి. దర్శకుడు అరుణ్ భీమవరపుతో సినిమాను అనౌన్స్ చేశాడు. లవ్ మీ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు ఈఫ్ యూ డేర్ అనేది ఉపశీర్షిక. ఈ సందర్బంగా లవ్ మీ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే సినిమాలో హీరో దెయ్యంతో ప్రేమలో పడతాడు అని అర్థమవుతోంది. పోస్టర్ లో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమా కోసం స్టార్ కాస్ట్ ను సెట్ చేశారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కూడా వర్క్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. మరి వినూత్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

ఇక ఆశిష్ విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన అద్వైత రెడ్డిని పెళ్లిచేసుకొని సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. జైపూర్ ప్యాలెస్ లో జరిగిన ఈ పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్ లో జరిగిన రెసెప్షన్ కు టాలీవుడ్ స్టార్స్ అందరు హాజరై వధువరులను ఆశీర్వదించారు.