
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఇండియన్ ప్రైడ్ మూవీ ఆర్ఆర్ఆర్(RRR) ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు ప్రపంచ సినిమా లవర్స్ కూడా ఫిదా అయ్యారు. అంతేకాదు.. ఫస్ట్ ఆస్కార్ అందుకున్న సౌత్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్. దీంతో హాలీవుడ్ స్టార్స్ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్టులో చేరిపోయాడు హాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు ఫిలిప్ నోయిస్. ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఫిలిప్ నోయిస్(Phillip Noyce) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఫాస్ట్ చార్లీ(Fast Charlie). గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా ఇటీవలే ఇండియా లో విడులా అయ్యింది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండియన్ మీడియాకు వరుస ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఫిలిప్ నోయిస్. ఇందులో భాగంగా ఆయన్ని ఆర్ఆర్ఆర్ సినిమా గురించి. ఇండియా సినిమా చేస్తే ఏ హీరోతో చేస్తారు అని ప్రశ్నించారు.
దానికి సమాధానంగా ఫిలిప్ నోయిస్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ కూడా చూశాను. ది బెస్ట్ మూవీ అనిపించింది. వరల్డ్ వైడ్ గా భారీ విజయం సాధించింది ఆ సినిమా. నాకు బాలీవుడ్ దర్శకుడు సత్యజిత్ రే సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన తీసిన పాతర్ పాంచాలి నా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. ఒకవేళ నేను ఇండియాలో సినిమా చేయాల్సి వస్తే.. షారుక్ ఖాన్‌తో చేస్తాను అని చెప్పుకొచ్చాడు ఫిలిప్ నోయిస్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.