83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న హాలీవుడ్‌ హీరో

83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న హాలీవుడ్‌ హీరో

హాలీవుడ్‌ హీరో అల్‌ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గతకొంత కాలంగా ఆయన 29 ఏళ్ల నూర్‌ అల్పల్లాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు సహజీవనం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా అల్పల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్‌ పాసినో పీఏ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త వరల్డ్ వైడ్ ట్రేండింగ్ గా మారింది. 

ఇక కోవిడ్‌ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని సమాచారం. అది పరిచయం కాస్త ప్రేమగా మారి రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు. అల్‌ పాసినో మాజీ ప్రియురాలు మీటల్‌ దోహన్‌తో బ్రేకప్‌ తర్వాత.. అల్పల్లాతో డేటింగ్‌ ప్రారంభించాడు ఈ ఓల్డేజ్ హీరో. అల్పల్లా కూడా అంతకు ముందు రోలింగ్‌ స్టోన్స్‌ సింగర్‌ మిక్‌ జాగర్‌తో డేటింగ్‌ చేసి విడిపోయింది. అల్పల్లాకు ఇది మొదటి సంతానం కాగా, పాసినోకు నాలుగో సంతానం.