BONALU 2025: తెలంగాణలో బోనాల జాతర... ముఖ్యమైన తేదీలు ఇవే..!

BONALU 2025: తెలంగాణలో బోనాల జాతర... ముఖ్యమైన తేదీలు ఇవే..!

బోనాల పండుగ ఒక్కరోజు తంతు కాదు. ఇది ఒక నెలపాటు కొనసాగే ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం. గోల్కొండలో ప్రారంభం కావడంతో నెక్ట్స్, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయం, హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజ మహాకాళి ఆలయం తదితర ప్రసిద్ధ దేవాలయాల్లో ఘనంగా కొనసాగుతుంది. ప్రతి ఆదివారం ప్రధాన ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరగా, ఆషాఢ మాసం చివరి రోజున, మళ్లీ గోల్కొండలో ఎల్లమ్మ ఆలయంలో జరిగే ముగింపు పూజలతో ఈ మహోత్సవానికి సమాప్తి పలుకుతారు.

 తెలంగాణలో 2025 జూన్ 26 నుండి బోనాల జాతర మొదలు కానుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా బోనాల పండుగను రాష్ట్రం మొత్తం నెల రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. గ్రామ దేవతను బోనం, జంతు బలి చేస్తారు. ఇది పల్లె వారికి ముఖ్యమైన పండుగ. ఇప్పుడు పట్టణాలకు కూడా పాకింది. 

  •  జూన్ 26 :  గోల్కొండ అమ్మవారికి తొలి బోనం
  •  జూన్ 29 :విజయవాడ కనకదుర్గ దేవికి 2వ బోనం
  •  జూలై 3: బల్కంపేట ఎల్లమ్మకు 3వ బోనం
  •  జులై 6 : జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి 4వ బోనం
  •  జూలై 10: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి 5వ బోనం
  •  జూలై 13 : సికింద్రాబాద్ లో బోనాల జాతర
  •  జూలై 14 : రంగం, అంబారిపై అమ్మవారి ఘటం ఊరేగింపు
  •  జూలై 15 : చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బోనం
  •  జూలై 17 : లాల్ దర్వాజా సింహవాహిని దేవికి చివరి బోనం
  • జూలై 20 : పాతబస్తీ, లాల్ దర్వాజా బోనాల జాతర
  •  జూలై 21 : పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు

 భాగ్యనగర బోనాలతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలోనూ బోనాల జాతర జరుగుతుంది. నెల రోజుల పాటు తెలంగాణ ప్రజలు  బోనం ఎత్తి సంబరాలు జరుపుకుంటారు. బోనాల పండుగలో ఊరేగింపులు, జానపద గీతాలు, డప్పులు, నృత్యాలు, పోతరాజులు, ఘటాల ఊరేగింపులు, రంగురంగుల అలంకరణలతో తెలంగాణ సంస్కృతికి జీవం పోసేలా ఉంటాయి. గ్రామీణ జీవనశైలి, భక్తిశ్రద్ధలు, ఉత్సాహంతో ప్రజలంతా ఒక్కటవుతూ ఈ పండుగను ఉత్సవంగా మలుస్తారు.