సత్తా చాటిన హాలీవుడ్ సినిమా.. ఏడు కేటగిరీల్లో అవార్డులు

సత్తా చాటిన హాలీవుడ్ సినిమా.. ఏడు కేటగిరీల్లో అవార్డులు

ప్రతిష్టాత్మిక ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఒక సినిమాకు ఏడు అవార్డులు దక్కాయి. హాలీవుడ్ సినిమా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Every thing Every where all at once)విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 11 విభాగాల్లో నామినేట్ ఐన ఈ సినిమా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో విజేతగా నిలిచింది. కాగా, ఈ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్ యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు.

  • ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • ఉత్తమ దర్శకుడు: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ నటి: మిషెల్‌ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ ఎడిటర్‌: పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)