హత్యలు చేసిందెవరు?
టైటిల్: చీకటిలో, ప్లాట్‌ఫాం: అమెజాన్ ప్రైమ్ వీడియో,
డైరెక్షన్: శరణ్ కొప్పిశెట్టి, కాస్ట్: శోభిత ధూళిపాళ్ల, విశ్వదేవ్ రాచకొండ, చైతన్య, విశాల లక్ష్మీ, ఇషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్, అదితి
సంధ్య నెల్లూరి (శోభిత ధూళిపాళ్ల) క్రిమినాలజీ చదివిన ఒక జర్నలిస్ట్. టీవీ చానెల్‌లో ఓ క్రైమ్ షోకి యాంకర్‌గా పనిచేస్తుంటుంది. టీఆర్‌పీ కోసం క్రైమ్స్‌ని సెన్సేషనల్‌గా ప్రెజెంట్ చేయడం ఆమెకు నచ్చదు. కానీ.. చానెల్ యాజమాన్యం మాత్రం ఆమె ఇష్టానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఉద్యోగం మానేసి తన ఫ్రెండ్ బాబీ (అదితి) కలిసి పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. అదే టైంలో ఆమె అమర్ (విశ్వదేవ్ రాచకొండ)తో లవ్‌లో ఉంటుంది. ఇద్దరి కుటుంబాలు వాళ్ల పెండ్లికి ఒప్పుకుంటాయి. అప్పుడే బాబీ, అమర్ హత్యకు గురవుతారు. హంతకుడు చంపేముందు బాబీని అత్యాచారం చేస్తాడు. సంధ్య ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రెండు హత్యలు చేసింది వాచ్‌మెన్ అనే నిర్ధారణకు వస్తుంది. అప్పుడే ఆమెకు అసలైన హంతకుడి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సంధ్య హంతకుడిని కనిపెట్టిందా? లేదా? అనేది మిగతా కథ.
అతని తప్పిదమేనా?
టైటిల్: స్పేస్ జెన్: చంద్రయాన్, ప్లాట్ ఫాం: జియో హాట్‌స్టార్, డైరెక్షన్: అనంత్ సింగ్, కాస్ట్: నకుల్ మెహతా, శ్రియా శరణ్, డానిష్ సైత్, ప్రకాశ్ బెలవాడి, గోపాల్ దత్
ఇది ఇస్రో చంద్రయాన్ మిషన్ల ఆధారంగా తీసిన వెబ్‌సిరీస్. ఈ కథ చంద్రయాన్–2 ఫెయిల్యూర్ తర్వాత మొదలవుతుంది. అర్జున్ (నకుల్ మెహతా) నావిగేషన్ సిస్టమ్స్ ఎక్స్‌పర్ట్. చంద్రయాన్ మిషన్‌లో ప్రోగ్రామర్‌గా పనిచేస్తుంటాడు. వాళ్ల నాన్న మిలటరీలో ఉండగా యుద్ధంలో సబ్–స్టాండర్డ్ శాటిలైట్ డివైజెస్ వల్ల చనిపోతాడు. అతని కోరిక మేరకే అర్జున్ ఇస్రోలో ప్రోగ్రామింగ్ యూనిట్లో జాబ్ సాధిస్తాడు. అప్పటినుంచి ఇండియాను గొప్ప స్పేస్ పవర్‌గా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తుంటాడు. కానీ.. చంద్రయాన్–2 ప్రయోగంలో విక్రమ్ రాకెట్ కక్ష్యలోకి వెళ్లాక మిస్ అవుతుంది. ఆ ప్రయోగం ఫెయిల్యూర్‌కు అర్జున్ కూడా ఒక కారణమని అతన్ని మిగతా ప్రాజెక్టుల నుంచి తప్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.
►ALSO READ | ప్రియాంక ఫైట్స్ కు మహేష్ ఫిదా
కానిస్టేబుల్ - ఖైదీ
టైటిల్ : సిరాయ్,
ప్లాట్ ఫాం : జీ5,
డైరెక్షన్:
సురేష్-రాజకుమారి,
కాస్ట్: విక్రమ్ ప్రభు, ఎల్‌కే అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్‌కుమార్, ఆనంద తంబిరాజా
కథిరవన్ (విక్రమ్ ప్రభు) ఒక సీనియర్ కాన్‌స్టేబుల్. ఆర్మ్‌డ్ ఎస్కార్ట్ డ్యూటీలో ఉంటాడు. ఖైదీలను కోర్టు నుంచి జైలుకు, జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లడం అతని డ్యూటీ. ఒకసారి కోర్టుకు తీసుకెళ్తుండగా ఒక ఖైదీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కథిరవన్ అతన్ని చంపేస్తాడు. దాంతో అతనిపై ఎంక్వైరీ వేస్తారు. అది కొనసాగుతున్నప్పుడే తనతోపాటు పనిచేసే మరో కానిస్టేబుల్‌కు అబ్దుల్ రౌఫ్ (ఎల్.కె. అక్షయ్ కుమార్)అనే ఖైదీని కోర్టుకు తీసుకెళ్లే పని అప్పగిస్తారు. కానీ.. అతను అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి ఆ పనిని కథిరవన్కు చెప్తాడు. అతను అబ్దుల్ రౌఫ్‌ని తీసుకుని వెల్లూర్ సెంట్రల్ జైల్ నుంచి శివగంగై కోర్టుకు బయల్దేరుతాడు. ఈ రెండింటి మధ్య దూరం 300 కి.మీ.లకుపైగానే ఉంటుంది. అబ్దుల్ మర్డర్ కేసులో అండర్‌ట్రయల్ ప్రిజనర్. ఐదేండ్లకు పైగా జైల్లో ఉన్నాడు. పారిపోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ప్రయాణంలో కథిరవన్కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?
