అగ్గువ వడ్డీకే హోమ్‌ లోన్స్‌

అగ్గువ వడ్డీకే హోమ్‌ లోన్స్‌
  • వడ్డీ రేటు 7 % కంటే తక్కువకే ఆఫర్ చేస్తున్న బ్యాంకులు, హెచ్‌‌ఎఫ్‌‌సీలు
  • కోటక్‌ బ్యాంక్‌లో అత్యంత తక్కువగా హోమ్‌ లోన్‌పై వడ్డీ
  • ఎలిజిబుల్‌ కస్టమర్లకు 6.80 % నికే లోనిస్తున్న ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: హోమ్‌‌‌‌ లోన్స్‌‌‌‌ తీసుకోవడానికి ఇదే మంచి టైమ్‌‌‌‌లా కనిపిస్తోంది. దేశంలోని టాప్‌‌‌‌ బ్యాంకులు, హోమ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీ(హెచ్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ)లు ఏడు శాతం కంటే తక్కువ వడ్డీకే లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. కోటక్‌‌‌‌ మహింద్రా బ్యాంక్‌‌‌‌ రూ.75 లక్షల లోన్‌‌‌‌ను 20 ఏళ్ల కాలానికి గాను 6.75 శాతం వడ్డీ రేటుకే ఆఫర్ చేస్తోంది. స్టేట్‌‌‌‌ బ్యాంక్ కూడా ఎలిజిబుల్‌‌‌‌ కస్టమర్లకు 6.80 శాతం వడ్డీ రేటుకే రూ.75 లక్షల లోన్‌‌‌‌ను 20 ఏళ్ల టైమ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌కు ఇస్తోంది.  ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించకుండానే  హోమ్ లోన్స్‌‌ను పొందొచ్చు. ఈ ఆఫర్  మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.  క్రెడిట్‌‌ స్కోర్‌‌‌‌ ఎక్కువగా ఉన్న బారోవర్లకు తక్కువ వడ్డీకే హోమ్‌‌లోన్లను ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పంజాబ్‌‌‌‌ నేషనల్ బ్యాంక్‌‌‌‌(పీఎన్‌‌‌‌బీ), హోమ్‌‌‌‌ లోన్‌‌‌‌ కంపెనీ  హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీలు కూడా రూ.75 లక్షలకు 20 ఏళ్ల టైమ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌కు గాను 6.80 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.   బ్యాంక్‌‌‌‌బజార్‌‌‌‌‌‌‌‌ డాట్‌‌‌‌ కామ్‌‌‌‌ డేటా ప్రకారం వివిధ ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు పక్క టేబుల్లో ఉన్నాయి. హోమ్‌‌‌‌ లోన్‌‌‌‌ అమౌంట్‌‌‌‌ రూ. 75 లక్షలు, 20 ఏళ్ల టైమ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌పై ఈఎంఐను బ్యాంక్‌‌‌‌ బజార్‌‌‌‌ డాట్‌‌‌‌ కామ్‌‌‌‌ లెక్కించింది…

 

 

ఇవి కూడా చదవండి

ఆరు నగరాల్లోనే ఐపీఎల్‌-14.. హైదరాబాద్‌కు దక్కని భాగ్యం

మహిళా దినోత్సవం కోరిక ఆమెదే

టెట్​ లేకుండానే టీచర్స్ రిక్రూట్​మెంట్​కు సర్కార్ ఆలోచన

మన్యంలో శిలాయుగం గుర్తులు