పశ్చిమ బెంగాల్‌‌కు పునర్వైభవం తీసుకొస్తాం

పశ్చిమ బెంగాల్‌‌కు పునర్వైభవం తీసుకొస్తాం

కోల్‌‌కతా: నోబెల్ గ్రహీత, కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. రెండ్రోజుల బెంగాల్ పర్యటనలో భాగంగా శాంతినికేతన్‌‌లోని రవీంద్ర భవన్‌‌ను షా విజిట్ చేశారు. బిర్భూమ్, శాంతినికేతన్‌‌లోని విశ్వ భారతి యూనివ్సిటీలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. ‘భారత్‌‌లోని అత్యంత గొప్ప ఆలోచనాపరుల్లో ఒకరైన గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్‌‌కు నివాళులు అర్పిస్తున్నా. దేశ స్వాతంత్రోద్యమంలో ఆయన పోషించిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన ఆలోచనలు రాబోయే తరాల్లోనూ స్ఫూర్తి నింపుతాయి. ఠాగూర్ కలలను నెరవేర్చేందుకు, బెంగాల్‌‌కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.