భవిష్యత్తులో కేసీఆర్ ప్రధాని అయితడు : మహమూద్ అలీ

భవిష్యత్తులో కేసీఆర్ ప్రధాని అయితడు : మహమూద్ అలీ

సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో దేశ ప్రధాని అవుతారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎంగా రాష్ట్ర ప్రజలకు ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారని చెప్పారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నాంపల్లిలోని తెలంగాణ ఎన్జీవో హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్‭లో మహమూద్ అలీ ప్రారంభించారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని.. ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. ఈ క్యాంప్‭లో ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. సేకరించిన ఈ రక్తాన్ని తలసేమియా బాధితులకు అందించనున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ తెలిపారు.