
హైదరాబాద్, వెలుగు: కార్గో, పార్శిల్ సేవలను మరింత విస్తరించేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. అన్ని జిల్లాల్లో హోం డెలివరీ సేవలతోపాటు హోం పికప్ సర్వీసులనూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారుల ఇంటి వద్దకే పార్శిల్ సేవలు అందించే దిశలో ప్రతిపాదనల్ని రూపొందించినట్లు తెలిపారు. ఆర్టీసీతో చేతులు కలిపేందుకు ఆసక్తి ఉన్న ఏ సంస్థలైన ముందుకు రావొచ్చన్నారు. వారి బిజినెస్ వివరాలను splofficertsrtc@gmail.comకు పంపాలని వారు కోరారు. వివరాలకు ఈ నెల 27లోపు 91541 97752 కు కాల్ చేయాలని సూచించారు.