ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెమట కంపుకు చెప్పండి గుడ్ బై

ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెమట కంపుకు చెప్పండి గుడ్ బై

వేసవి వచ్చింది.. ఈ టైంలో మనల్ని ఎక్కువగా చికాకు పెట్టేది వేడి వల్ల కలిగే చెమట. టీనేజర్స్, పెద్దవారు ఏ వయసులో ఉన్నవారైనా సరే ఎండాకాలంలో చెమట ఎక్కువ పడుతుంది. ఇది శరీర తీరుని బట్టి కూడా కొందరికి విపరీతమైన చెమట, దుర్వాసనతో వస్తుంది. అలాంటి వారు చెడు వాసన దూరం చేసుకోవాలని చాలా మంది బాడీ స్ప్రే వాడతారు. కానీ అవి వాడకుండానే సహజంగానే శరీర దుర్వాసనని దూరం చేసుకోవచ్చు.  ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడ మనం చూద్దాం...

టమాట రసం
స్నానం చేసే నీటిలో తాజా టమాట రసాన్ని వేయండి. ఈ నీటితో స్నానం చేయండి. లేదా టబ్‌లో ఆ నీటిని పోసి 20 నిమిషాల పాటు అందులో కూర్చోండి. దీని వల్ల దుర్వాసనని కలిగించే బ్యాక్టీరియా తగ్గుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.


వంటసోడా
వంట సోడా కూడా చెమట వాసనని దూరం చేస్తుంది. ఇందుకోసం ఓ కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. దీనిని స్ప్రే బాటిల్‌లో వేసి రోజూ అండర్ ఆర్మ్స్ ప్రాంతంలో స్ప్రే చేయండి. ఆరిన తర్వాత బట్టలు వేసుకోండి.


ఆపిల్ సైడర్ వెనిగర్
విపరీతంగా చెమటలు పడుతుంటే టీ స్పూన్ పరిమాణంలో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో అంతే పరిమాణంలో నీటిని కలపండి. ఇందులో కాటన్‌బాల్‌ని డిప్ చేయండి. దీనిని బాడీకి అప్లై చేస్తే pH బ్యాలెన్స్ అయి బ్యాక్టీరియా దూరమై చెడు వాసన రాదు.


టీట్రీ ఆయిల్
రెండు స్పూన్ల పరిమాణంలో టీట్రీ ఆయిల్ తీసుకోండి. దానికి అంతే పరిమాణంలో నీటిని కలపండి.  చెమట ఎక్కువగా పట్టే భాగాల్లో అప్లై చేయండి. టీట్రీ ఆయిల్‌లోని సహజ క్రిమినాశక, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చెమట వాసనని దూరం చేస్తాయి.


 కార్న్ స్టార్చ్
చర్మం pH లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కార్న్ స్టార్చ్, నిమ్మరసం హెల్ప్ చేస్తుంది. రెండు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల కార్న్ స్టార్చ్‌ని కలిపి పేస్టులా చేయండి. దీనిని అండర్‌ఆర్మ్స్‌కి అప్లై చేసి పదినిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత క్లీన్ చేయండి. దీని వల్ల స్మెల్ తగ్గుతుంది.


గ్రీన్ టీ
నీటిని బాగా మరిగించి అందులో కొన్ని గ్రీన్ టీ లీవ్స్ వేయండి. 5 నిమిషాల అలానే ఉంచి దానిని చల్లారనివ్వండి. తర్వాత అందులో దూదిని ముంచి చెమట పట్టిన చోట అప్లై చేయండి. గ్రీన్ టీ చర్మాన్ని పొడిగా చేస్తుంది. వాసనని దూరం చేస్తుంది. వారానికి రెండు సార్లు ఇలా చేయండి.