బరువు తగ్గించే హోం రెమిడీ

బరువు తగ్గించే హోం రెమిడీ

బరువు తగ్గాలని, బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలని చాలా మందికి ఉంటుంది.  ఇందుకోసం రోజూ యోగా, ఎక్సర్‌‌సైజ్‌లు చేస్తుంటారు. రకరకాల రెమిడీలు ఫాలో అవుతుంటారు. అయితే, ఈ సింపుల్ హోం రెమిడీతో బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చని అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌.

తేనే, దాల్చిన చెక్క బరుగు తగ్గేందుకు బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణలు అంటున్నారు. తేనె ఆకలిని నియంత్రించడంతో పాటు అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి మెటబాలిజం రేటు పెంచుతుంది. శరీరంలోని అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సాయపడుతుంది. అందుకే తేనె, దాల్చిన చెక్క కలిపిన నీళ్లు తాగితే బెల్లీ ఫ్యాట్‌ని కరిగించుకోవడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. 

తేనె, దాల్చిన చెక్క రెమిడీ:

ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక దాల్చిన చెక్క ముక్క లేదా అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఆ మిశ్రమం చల్లారాక అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కొంత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయొచ్చు. ఈ మిశ్రమాన్ని పరిగడుపున, ఎక్సర్‌‌సైజ్ చేసే ముందు, ఆకలి వేసినప్పుడు లేదా రాత్రి నిద్రపోయేముందు తాగితే బరువు తగ్గి, బెల్లీ ఫ్యాట్ పోతుంది.