హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్ నివాస ఇండ్ల మార్కెట్ గత నెల బలమైన వృద్ధి సాధించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం నగరంలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 16 శాతం పెరిగాయి. ఈ నెలలో మొత్తం 6,837 నివాస ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి.
వీటి మొత్తం విలువ రూ.4,673 కోట్లు కాగా, ఇది గతేడాది కంటే 13 శాతం ఎక్కువ. మొత్తం విక్రయాలలో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్ల వాటా 19 శాతంగా ఉంది. రూ.50 లక్షల లోపు బడ్జెట్ ఇళ్ల రిజిస్ట్రేషన్లు 18 శాతం వృద్ధి సాధించాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య గల ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా 15 శాతం పెరిగాయి.
