కరోనాకు హోమియోపతి మందు.. ఆర్సినికం ఆల్బమ్ 30తో చెక్

కరోనాకు హోమియోపతి మందు.. ఆర్సినికం ఆల్బమ్ 30తో చెక్

చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయాందోళనల్లోకి నెట్టేసిన ప్రాణాంతక కరోనాకు హోమియోపతి, యునాని మందులు బాగా పనిచేస్తాయని కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సెంట్రల్​ కౌన్సిల్​ ఫర్​ రీసెర్చ్​ ఇన్​ హోమియోపతి (సీసీఆర్​హెచ్) సైంటిఫిక్​ అడ్వైజరీ బోర్డు సమావేశం తర్వాత ఆయుష్​ ఈ ప్రకటన చేసింది. హోమియోపతి మందులతో కరోనా ఇన్​ఫెక్షన్లు తగ్గించే విధానాలపై చర్చించింది. ఆర్సినికం ఆల్బమ్​ 30 అనే మందు కరోనాపై బాగా పనిచేస్తుందని, పరగడుపుతో మూడు రోజుల పాటు తీసుకుంటే కరోనా వైరస్​ సోకకుండా నియంత్రించవచ్చని తెలిపింది. మరో నెల తర్వాత సేమ్​ డోస్​ను తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయని చెప్పింది. కొన్ని ఆయుర్వేదిక్​ మందులు, యునాని డికాక్షన్లు, ఇంటి ఔషధాలూ మెరుగ్గా పనిచేస్తాయని చెప్పింది.

చైనాలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 170కు పెరిగింది. దాదాపు 6 వేల మంది దాకా దాని బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే కేసులు 30 శాతం దాకా పెరిగాయి. చాలా ఎయిర్​లైన్స్​ సంస్థలు చైనా ట్రిప్పులను క్యాన్సిల్​ చేశాయి. మరోవైపు గురువారం ఇండియాలోనూ తొలి కరోనా కేసు నిర్ధారణ అయింది. చైనా నుంచి కేరళకు వచ్చిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్ష్లో తేలింది. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.