హర్యానా రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..45 మందికి తీవ్రగాయాలు

హర్యానా రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..45 మందికి తీవ్రగాయాలు

హర్యానాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మే 28) హర్యానాలోని సోనిపేట్ జిల్లా రాయ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ రబ్బరుఫ్యాక్టరీలో ఒక్కసారిగా మం టలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 45 మంది కార్మికులు గాయపడ్డారు. 

మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రబ్బరు  బెల్టులు తయారు చేసే ఈ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదానికి కారణమయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రబ్బరు  బెల్టులు తయారు చేసే ఈ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదానికి కారణమయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఫ్యాక్టరీ భద్రతా ఏర్పాట్లపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.