ముంబైలోని పాల్ఘర్ యార్డ్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ముంబైలోని పాల్ఘర్ యార్డ్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం (మే28) సాయంత్రం గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. గుజరాత్ నుంచి ముంబైకి వచ్చే రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో సుమిత్ ఠాకూర్ తెలిపారు. కాగా ఇనుప కాయిల్స్ తో రైలు పన్వేల్ కు వెళ్తోంది. విషయం తెలుసుకున్న రైల్వేశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న లైన్ లో ట్రాఫిక్ నుపునరుద్దరించేందుకుచర్యలు చేపట్టామని ఠాకూర్ తెలిపారు.