తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వేదాంతు కోచింగ్ సెంటర్లు

తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వేదాంతు కోచింగ్ సెంటర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వచ్చే రెండేళ్లలో తెలుగురాష్ట్రాల్లో పదికిపైగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఎడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ కంపెనీ వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు, వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకటి, విజయవాడలో రెండు కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు విగ్నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ కంపెనీ టై అప్ అయ్యింది. 

పర్సనలైజ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, క్వాలిటీకి తమ లెర్నింగ్ సెంటర్లలో ప్రాధాన్యం ఉంటుందని వంశీ కృష్ణ అన్నారు. అకాడమిక్ మెంటార్లు అందుబాటులో ఉంటారని, స్టూడెంట్ల పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెక్ చేసేందుకు రియల్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని,  స్టూడెంట్లపై ఎటువంటి ఒత్తిడి ఉండదని  వివరించారు. ఒక బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 55 మంది స్టూడెంట్లు ఉంటారని తెలిపారు. ఫీజులు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి మారుతాయన్నారు.