ఇంటికో క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌

ఇంటికో క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిజిటల్‌‌‌‌ డోర్ నంబర్లు
పారిశుధ్య నిర్వహణకు ఇంటిగ్రేటేడ్‌‌‌‌ శానిటేషన్‌‌‌‌ సిస్టం
స్యూరాపేటలో పైలట్​ ప్రాజెక్టు.. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగురాష్ట్రంలోని ప్రతి ఇంటికీ క్యూఆర్​కోడ్​ ఆధారిత డిజిటల్ డోర్​ నంబర్స్​ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఒకటి రెండేళ్లలో అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో దీనిని అమలు చేయనుంది. ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్‌‌‌‌ డోర్‌‌‌‌ నంబర్‌‌‌‌ను మున్సిపల్‌‌‌‌ శాఖ కేటాయించనుంది. ఇందులో నగరం/పట్టణం పేరు తెలిపే కోడ్‌‌‌‌, వార్డు/డివిజన్‌‌‌‌ తెలిపే మరో కోడ్‌‌‌‌, స్థానిక కాలనీని తెలిపే ఇంకో కోడ్‌‌‌‌ ఉంటాయి. ఈ మూడు కోడ్స్‌‌‌‌ తర్వాత ప్రతి ఇంటికీ ప్రత్యేక డోర్‌‌‌‌ నంబర్‌‌‌‌ కేటాయిస్తారు. ఇప్పటికే పైలట్‌‌‌‌ ప్రాజెక్టును సూర్యాపేట మున్సిపాల్టీలో ప్రారంభించారు.

రిజిస్ట్రేషన్‌‌‌‌ శాఖతో లింక్‌‌‌‌

ఇళ్ల కొనుగోలు, అమ్మకాల సందర్భంగా సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌‌‌‌ సమయంలో మున్సిపాల్టీ రికార్డుల్లోనూ యజమాని పేరు మారేలా ఆటోమెటిక్‌‌‌‌ మ్యుటేషన్‌‌‌‌ విధానాన్ని ప్రస్తుతం అమలు చేస్తున్నారు. అయితే కొన్ని డోర్‌‌‌‌ నంబర్ల విషయంలో సమస్యలు వస్తున్నాయి. రికార్డుల్లో ఒక నంబర్‌‌‌‌ ఉంటే క్షేత్రస్థాయిలో మరో నంబర్‌‌‌‌ ఉంటోంది. దీంతో మ్యుటేషన్‌‌‌‌ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే అన్ని నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి, వీధికి కొత్తగా డిజిటల్‌‌‌‌ డోర్‌‌‌‌ నంబర్లు కేటాయించబోతున్నారు. మున్సిపాల్టీల్లో పారిశుధ్య నిర్వహణతోనూ ఈ డిజటల్‌‌‌‌ నంబర్లను అనుసంధానిస్తారు. మున్సిపల్‌‌‌‌ సిబ్బంది ప్రతి ఇల్లు, వీధి నుంచి రోజూ చెత్తను క్రమం తప్పకుండా సేకరించింది.. లేనిది నిర్ధారించేందుకు క్యూఆర్ కోడ్‌‌‌‌ను వినియోగించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటేడ్‌‌‌‌ శానిటేషన్‌‌‌‌ సిస్టంను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.

అధ్యయనం కోసం కమిటీ..

డిజిటల్‌‌‌‌ డోర్ నంబర్లకు అమలుకు సంబంధించి బెంగళూరు, ఢిల్లీ, విజయవాడలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి, రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ను రూపొందించేందుకు ప్రభుత్వం సీనియర్‌‌‌‌ అధికారులతో ఇటీవల ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ మెంబర్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌గా జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌ లోకేష్ కుమార్, ఎంఏయూడీ డైరెక్టర్‌‌‌‌ టీకే శ్రీదేవి, టీడీఎస్‌‌‌‌ ఎండీ జీటీ వెంకటేశ్వర్ రావు, ఐటీ శాఖ అడిషనల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ముషారఫ్ ఫారుకి, హెచ్‌‌‌‌ఎండీఏ చీఫ్‌‌‌‌ సిటీ ప్లానర్‌‌‌‌ ఎస్.దేవేందర్ రెడ్డి, నేషనల్‌‌‌‌ ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ అర్బన్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ సీనియర్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ డి.గౌతమి సభ్యులుగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.