
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా యాక్టివా కొత్త మోడల్ లాంఛ్ చేసింది.మూడు వేరియంట్లలో ఈ వెహికిల్స్ అందుబాటులోకి తెచ్చారు. న్యూ మోడల్ యాక్టివాలో రెండు కొత్త టెక్నాలజీలు ఉపయోగించారు. వెహికల్ ఎక్కడుందో తెలియజేసే స్మార్ట్ కీ ఫీచర్ ఇందులో ఉంది. అంతేకాకుండా ఈ కొత్త యాక్టివాలో ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ (ఓబీడీ) డివైజ్ ను అమర్చారు. బండి నుంచి ఎంత పొగ వస్తోందనేది ఈ డివైజ్ మానిటర్ చేస్తుంది. ఈ బండి ధర వేరియెంట్ ను బట్టి రూ. 74,536 నుంచి 80,537 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించారు.