
న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్స్ సీబీ750 హార్నెట్, సీబీ1000 హార్నెట్ఎస్పీ లను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. హోండా సీబీ750 హార్నెట్ 755సీసీ లిక్విడ్- కూల్డ్ ప్యారలల్ -ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది ఎక్కువ పవర్‌ను, టార్క్‌ను అందిస్తుందని, రోజువారీ రైడింగ్‌కు, రోడ్లపై థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్‌కు ఇది అనువుగా ఉంటుందని హోండా తెలిపింది.
ఏబీఎస్, టర్నర్, ఇతర ఆధునిక ఫీచర్లతో వస్తుంది. సీబీ1000 హార్నెట్ఎస్పీ 1000 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్- ఫోర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది హై-పెర్ఫార్మెన్స్ బైకర్లను ఆకట్టుకుంటుంది. సీబీ1000 హార్నెట్ఎస్పీ లో ఓహ్లిన్స్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్‌లు, ఐదు-అంగుళాల కలర్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ -బై -టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ (హోండా రోడ్‌సింక్), యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. రెండు బైకుల్లో స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, యూజర్ అనే 4 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో 3 స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది.