
హోండా ఇండియా మార్కెట్లో ఎలివేట్పేరుతో మిడ్సైజ్డ్ ఎస్యూవీని లాంచ్ చేసింది. 2030 నాటికి మరో ఐదు కొత్త ఎస్యూవీలను లాంచ్ చేస్తామని, ఇందులో ఒకటి ఎలక్ట్రిక్ మోడల్ ఉంటుందని ప్రకటించింది. ఎలివేట్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 121 బీహెచ్పీని, 145 ఎన్ఎం టార్క్ను ఇస్తుంది. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, లేన్ వాచ్ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.