హైదరాబాద్​లో హోండా ఎలివేట్ లాంచ్

హైదరాబాద్​లో హోండా ఎలివేట్ లాంచ్
  •     ఎస్ యూవీ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన కంపెనీ
  •     కారు ధర రూ. 11 లక్షల నుంచి స్టార్ట్

హైదరాబాద్ , వెలుగు :  హోండా కార్స్ ఇండియా తమ మొదటి ఎస్ యూవీ ఎలివేట్ ను హైదరాబాద్ లో లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 11 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ( ఎక్స్ షోరూం హైదరాబాద్) ఉంది. ఎలివేట్  నేషనల్ లాంచ్ ఈ నెల 4 న జరగగా అదే రోజు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ నెల 9 న హైదరాబాద్ లో 100 కార్లను డెలివరీ చేస్తామని కంపెనీ నేషనల్ సేల్స్ హెడ్ నిఖిల్ సరీన్ అన్నారు. ఎలివేట్ కార్ల డెలివరీ పీరియడ్ 5 నెలల వరకు ఉందని చెప్పారు. ఇంకో మూడేళ్లలో ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ని తీసుకొస్తామని నిఖిల్ అన్నారు.  2030 నాటికి భారత్ లో 5 ఎస్ యూవీ మోడల్స్ ను తెస్తామని పేర్కొన్నారు. తాజాగా ఎలివేట్ పెట్రోల్ వెర్షన్ ను లాంచ్ చేశారు.

హుండై వెన్యూ, కియా సోనెట్, టాటా మోటార్స్ నెక్సాన్ వంటి కార్లతో ఎలివేట్ పోటీపడుతుంది. భారత్ తమకు మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మారిందని నిఖిల్ అన్నారు. 2022–-23 లో తయారు చేసిన కార్లలో 20 శాతం ఎగుమతి చేశామని చెప్పారు. మెక్సికో, టర్కీ, మిడిల్ ఈస్ట్, చుట్టుపక్క దేశాలు, సౌత్ ఆఫ్రికా కు ఎగుమతులు జరిపామని అన్నారు. ఎలివేట్ మోడల్ బండ్లను కూడా భారత్ నుంచే ఎగుమతి చేస్తామని వెల్లడించారు. హోండా కార్స్ ఇండియా 2040 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుందని మార్కెటింగ్ జీఎం సబా ఖాన్ అన్నారు.

 2030 నాటికి 2/3 వంతు ఎలక్ట్రిక్ , హైబ్రిడ్ కార్లు ఉంటాయని వివరించారు. కిందటేడాది జరిగిన సేల్స్ లో 10 శాతం రానున్న ఫెస్టివల్ సీజన్ లో సాధిస్తామని, డిమాండ్ బాగుందని వెల్లడించారు. కాగా, హోండా ఎలివేట్ లో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. 89 కిలో వాట్స్ పవర్ ను, 145 ఎన్ఎం టార్క్ ను విడుదల చేస్తుంది. నాలుగు వేరియంట్లలో ఈ కారు ను తీసుకొచ్చారు. లీటర్ కు సగటున 15 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.