వెహికల్ లోన్లు ఇచ్చేందుకు హోండా ఫైనాన్స్ ఏర్పాటు

వెహికల్ లోన్లు ఇచ్చేందుకు హోండా ఫైనాన్స్ ఏర్పాటు
  • త్వరలో ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ లైసెన్స్‌‌‌‌కు దరఖాస్తు చేయనున్న కంపెనీ

న్యూఢిల్లీ: భారతదేశంలో కస్టమర్లకు ఫైనాన్స్ సేవలు అందించేందుకు  "హోండా ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌” అనే కొత్త అనుబంధ సంస్థను హోండా మోటార్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా హోండా బండ్ల  కొనుగోలుకు లోన్లు, లీజ్ ఆప్షన్లు వంటి ఫైనాన్సింగ్ సేవలు అందించనుంది.

భారత్‌‌‌‌లో బైక్‌‌‌‌లు, కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, లోన్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతుందని ఈ కంపెనీ  అంచనా వేస్తోంది.  ఇప్పటివరకు ఈ సేవలు స్థానిక ఫైనాన్షియల్ సంస్థల ద్వారా అందాయి.  ఇప్పుడు హోండా స్వయంగా ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ  లైసెన్స్ కోసం దరఖాస్తు చేసి,  తన సేవలను విస్తరించనుంది. జపాన్, ఉత్తర అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఫైనాన్సింగ్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది.