హోండా కొత్త సిరీస్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. మారుతీ, మహీంద్రా, హ్యుండై కార్ల పనైపోయినట్టేనా..?

హోండా కొత్త సిరీస్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. మారుతీ, మహీంద్రా, హ్యుండై కార్ల పనైపోయినట్టేనా..?

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ  హోండా 0 సిరీస్ SUVని 2026లో ఇండియాలో లాంచ్ చేయనుంది. అయితే దీనిని పూర్తిగా నిర్మించిన యూనిట్ (CBU)గా దిగుమతి చేసుకుంటమని  తెలిపింది.  CES 2025లో మొదట  ప్రోటోటైప్‌గా ప్రదర్శించిన ఈ ప్రీమియం ఆల్-ఎలక్ట్రిక్ SUVని పూర్తిగా కొత్తగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనుంది. ఉత్పత్తి మోడల్ 2026 మొదట్లో  రానుంది. మొదట ఉత్తర అమెరికాలో, తరువాత ఇతర ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు ఉంటాయి. 

ఈ హోండా 0 సిరీస్ SUVకి క్వాసి-MPV లుక్ ఉంది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ కెపాసిటీతో సాఫ్ట్‌వేర్ వాహనం అవుతుంది. 2026 మొదట్లో ప్రొడక్షన్-స్పెక్ మోడల్ ప్రారంభం కానుంది. ఈ SUV హోండా కొత్త 0 సిరీస్ EVలోని ఏడు మోడళ్లలో మొదటిది.  CES 2024లో చూపించిన  స్పేస్-హబ్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు.  

U- ఆకారపు టెయిల్-ల్యాంప్‌లు, కారుకు లేయర్డ్ ఎఫెక్ట్‌ ఇచ్చే  ఫ్రంట్, బ్యాక్ బంపర్లు కొన్ని ఈ కార్ డిజైన్ హైలెట్స్. 0 సిరీస్ EVలు అన్నీ సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్స్ (SDVలు) అవుతాయని హోండా తెలిపింది. అంటే లెవల్ 3 ఆటోమేటెడ్ డ్రైవింగ్ వంటి టెక్నాలజీలపై ఉంటుంది. హోండా ASIMO OS అనే బ్రాండ్-న్యూ ఆపరేటింగ్ సిస్టమ్‌ని అభివృద్ధి చేసింది. 

హోండా 0 సిరీస్ SUV టెక్నికల్ వివరాలను  ఇంకా వెల్లడించలేదు కానీ RWD లేదా AWD కాన్ఫిగరేషన్‌లలో అందించనున్నట్లు వెల్లడించింది. కెపాసిటీ  పెంచడానికి ఈ కారు అల్ట్రా-స్లిమ్ & తేలికపాటి బ్యాటరీ అప్షన్స్ ఉంటాయి. 0 సిరీస్ SUV 80kWh & 100kWh  మల్టి బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుందని, అంచనా ప్రకారం 500 కి.మీ ప్రయాణిస్తుందని హోండా గతంలో వెల్లడించింది.  

హోండా EV టెక్నాలజీని చూపించే ఉత్పత్తిగా 0 సిరీస్ SUVని ఇండియాకి  తీసుకువస్తుంది. దీని ధర ఎవరైనా ఊహించవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రీమియంగా  ఉంటుంది. జపాన్ మొబిలిటీ షోలో హోండా 0 α (ఆల్ఫా) SUV కాన్సెప్ట్ కూడా భారతదేశానికి వస్తుందని, ఇక్కడే తయారు అవుతువుందని హోండా తెలిపింది.  ఈ కార్ రాబోయే మారుతి e-విటారా , మహీంద్రా BE6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో పోటీ పడే అవకాశం ఉంది.