ఆర్టీసీ డ్రైవర్ ఔదార్యం 

ఆర్టీసీ డ్రైవర్ ఔదార్యం 
  • డబ్బులు పోగొట్టుకున్న ప్రయాణికుడికి

మణుగూరు, వెలుగు: ఆర్టీసీ బస్సులో డబ్బులు పోగొట్టుకున్న ప్రయాణికుడికి డబ్బులు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. మణుగూరు, అమలాపురం సర్వీస్ బస్సు డ్రైవర్ ఇల్లటూరి మహేశ్ మంగళవారం తిరుగు ప్రయాణంలో అమలాపురం నుంచి మణుగూరుకు వస్తున్న క్రమంలో అశ్వరావుపేటకు చెందిన ఓ ప్యాసింజర్ లక్ష రూపాయలతో ఉన్న పర్సును పోగొట్టుకున్నాడు.

బస్సు మణుగూరుకు చేరుకున్న క్రమంలో బాధితుడు తన పర్సు పోయిన విషయాన్ని మణుగూరు డిపో అధికారులకు తెలియజేశాడు. అధికారులు డ్రైవర్ మహేశ్​కు సమాచారం అందించగా బస్సును తనిఖీ చేసి పర్సును గుర్తించి బాధితుడికి అందజేశాడు. నిజాయితీగా పర్సును అందించిన డ్రైవర్ మహేశ్​ను బాధితుడు, ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.