ఎయిరిండియా విమానాలను నిషేధించిన హాంగ్ కాంగ్

ఎయిరిండియా విమానాలను నిషేధించిన హాంగ్ కాంగ్

న్యూఢిల్లీ: భారత్ నుండి విమాన సర్వీసులను హాంగ్ కాంగ్ ప్రభుత్వం మళ్లీ నిషేధం విధించింది. రెండు వారాలపాటు అంటే వచ్చే నెల 3వ తేదీ వరకు నిషేధించినట్లు ప్రకటించింది. ఢిల్లీ లో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుండడంతో..   తమ దేశానికి వచ్చిన వారు కరోనా బారినపడడంతో నిషేధం విధించాల్సి వచ్చిందని హాంగ్ కాంగ్ ప్రభుత్వం తెలియజేసింది. అయితే మూడు రోజుల ముందు అంటే కనీసం 72గంటల ముందు కరోనా టెస్ట్ చేయించుకుని నెగటివ్ వచ్చిన భారతీయులు హాంగ్ కాంగ్ రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. వారు ఇక్కడకు వచ్చాక ఎయిర్ పోర్టులో మళ్లీ కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తుండడంతో హాంగ్ కాంగ్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. అన్ లాక్ ప్రారంభమైన తర్వాత ఇప్పటికే నాలుగుసార్లు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసి మళ్లీ పునరుద్ధరించింది.

Read More News…

టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశారు.. అలరిస్తున్న ట్రైలర్

మొబైల్ డేటా వినియోగించాడంటూ తమ్ముడిని హత్య చేసిన అన్న

కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాతే  ప్రచారం చేయాలి

రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం