జనం కోసం హాంకాంగ్ దీవి

జనం కోసం హాంకాంగ్ దీవి

దేశమేమో చిన్నది. జనాభా ఏమో పెద్దది. పైగా టూరిస్ టుల తాకిడి ఎక్కువ. కొత్తగా ఇళ్లు కడదామంటే జాగా లేదు. చాలా మంది రోడ్లపైనే ఉంటున్నారు. దీంతో బుల్లి దేశం హాంకాంగ్‌‌కు మెరుపులాంటి ఆలోచన తట్టింది. అదే కృత్రిమ ద్వీపం. లాంటవు విజన్ టుమారో పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 2,500 ఎకరాల్లో 4 లక్షల ఇళ్లు కట్టనున్నారు. వీటిలో 70 శాతం ఇళ్లను సాధారణ ప్రజలకే ఇవ్వనున్నారు. 2,032లో గృహ ప్రవేశాలు ఉంటాయని హాంకాంగ్ సర్కారు ఇప్పటికే ప్రకటించేసింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 8 వేల కోట్ల డాలర్లను ఖర్చు చేయనున్నారు. అదే నిపుణులను కలవరపరుస్తోంది. ఇది పూర్తయితే ప్రపంచంలో ని అతి పెద్ద కృత్రిమ దీవుల్లో ఒకటిగా నిలుస్తుంది.