హాంకాంగ్ లో టెన్షన్.. టెన్షన్..

హాంకాంగ్ లో టెన్షన్.. టెన్షన్..

హాంకాంగ్: మరింత స్వేచ్ఛ కోరుతూ హాంకాంగ్ లో కొనసాగుతున్న నిరసనలు శనివారం ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, బాటిళ్లు విసిరారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వున్ టాంగ్ ఏరియాలో ఆఫీసర్లను వేలాది మంది ఆందోళనకారులు నిర్బంధించారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే సర్కారు స్పందించడం లేదని ఆందోళనకారులన్నారు.