ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్

ప్రపంచంలో ఏది ఖరీదైన నగరం అంటే హాంకాంగ్ అని ఆన్సర్ ఇస్తోంది ఈసీఏ ఇంటర్నేషనల్ సంస్థ. అవునూ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న నగరాల్లో హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు ఈసీఏ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఒక కప్పు కాఫీ 5.21 డాలర్లు, పెట్రోల్ 3డాలర్లు, కిలో టమాట 11.51 డాలర్లు వంటివి హాంకాంగ్ ను  మొదటి స్థానంలో నిలిపాయని ఈసీఏ తెలిపింది. వివిధ నగరాల్లో వ్యక్తుల జీవన ప్రమాణాలు, రోజూవారి ఖర్చులు, నిత్యావసరాల ధరలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబిత తయారుచేసింది ఈసీఏ సంస్థ.

టర్కీకి చెందిన ఆంకారా 207వ స్థానంలో నిలిచి అత్యంత చౌక నగరంగా నిలిచింది.ఈ జాబితాలో న్యూయార్క్ సెకండ్ ప్లేస్, జెనీవా థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. అదేవిధంగా లండన్ నాలుగో ప్లేస్, టోక్యో ఐదో స్థానంలో నిలిచాయి. పెరిగిన అద్దె ఖర్చులు లండన్, న్యూయార్క్ నగరాలను టాప్-5లో నిలిచేలా చేశాయి. లండన్ లో 20శాతం, న్యూయార్క్ లో 12శాతం అద్దెలు పెరిగాయి.న్యూయార్క్ సిటీలో రెసిడెన్షియల్ మార్కెట్ మళ్లీ పుంజుకుంటోంది. అయితే కరోనా సంక్షోభం వల్ల ఆశించిన స్థాయిలో మార్కెట్ లేదు. ఇక అద్దె, పెట్రోల్ వంటి వాటిల్లో గణనీయమైన పెరుగదల ఉన్నప్పటికీ సింగాపూర్ 13వ స్థానంలో నిలిచింది. సింగాపూర్ డాలర్ బలహీనపడడమే దీనికి కారణమని ఈసీఏ తెలిపింది.

యోన్ బలహీనపడడం వల్ల జపనీస్ నగరాల ర్యాంకులు దిగజారాయి. అయితే చైనా నగరాలైన షాంఘై, గ్యాంగ్జవ్ నగరాలు మాత్రం వరుసగా 8, 9స్థానాల్లో నిలిచాయి. ఇక అన్ని నగరాల్లో గత ఏడాదితో పోలిస్తే పెట్రోల్ రేట్లు 37శాతం పెరిగినట్లు ఈసీఏ తెలిపింది. ఇక ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా అన్ని నగరాల్లో వంట నూనెలు 25శాతం పెరిగినట్లు ఈసీఏ తెలిపింది. ప్రపంచ ద్రవ్యోల్బణంతో హాంకాంగ్ ప్రభావితమైనప్పటికీ అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రకటించింది. ఇటీవల హాంకాంగ్ లో హెచ్రిపల్స్బే బీచ్ తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో హాంకాంగ్ కోవిడ్ నిబంధనలను సడలించింది. దీంతో టూరిస్టులు హాంకాంగ్ బాటపడుతున్నారు.