మాన్షన్ 24 వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌

మాన్షన్ 24 వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’. సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈరోజు నుంచి డిస్నీ ప్లస్‌‌‌‌ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఓంకార్ మాట్లాడుతూ ‘నేను రూపొందించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది.  

ఫ్యామిలీ అందరితో కలిసి చూస్తూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. టీమ్ అంతా కష్టపడి మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చాం’ అన్నాడు. వరలక్ష్మి మాట్లాడుతూ ‘తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే కూతురిగా చాలెంజింగ్‌‌‌‌ రోల్‌‌‌‌లో కనిపిస్తా. బయట మనం చూసే అమ్మాయిల్లా సహజంగా నటించాను’ అని చెప్పింది.  అవికా గోర్ మాట్లాడుతూ ‘చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేశా.  ప్రతి ఎక్స్‌‌‌‌ప్రెషన్, లుక్ ఎలా ఉండాలో ఓంకార్ గారు చెప్పేవారు.

ఇందులో భారీ కాస్టింగ్ ఉంది. వారందరితో కలిసి నటించడం హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది’ అని చెప్పింది. ఈ సిరీస్  ఎండింగ్ బాహుబలి 1 క్లైమాక్స్ లాంటి ఇంపాక్ట్ తో ఉంటుంది అన్నారు సత్యరాజ్. నటులు రాజీవ్ కనకాల, మానస్, శ్రీమాన్, నందు, అభినయ, అర్చన జాయిస్, మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బాడిస, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.