పశువుల కోసం హాస్టళ్లు

పశువుల కోసం హాస్టళ్లు

సిద్దిపేట : పాడి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. పశువుల కోసం మంచి దానా సరఫర చేస్తున్నట్లు తెలిపిన వ్యవసాయశాక..వాటికి అనారోగ్యం వస్తే హెల్ప్ లైన్ 1962 ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పశువుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సిద్దిపేట నియోజకవర్గంలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

గొర్రెల కోసం ఇప్పటికే ఈ తరహా ఏర్పాట్లు చేసిన అధికారులు..దాని ద్వారా సత్పలితాలు పొందడంతో పశువుల కోసం ఫస్ట్ టైం హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పాల ఉత్పత్తి పెంచి రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తుండగా..జనవరి నెలాఖరులోగా 8 గ్రామాల్లో వీటి నిర్మాణాలు పూర్తి కానున్నాయని తెలిపారు అధికారులు. త్వరలోనే ఈ వెసులుబాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్లాన్ చేస్తామని చెప్పారు.