వేడి వేడి సేమియా పులావ్.. పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు.. ఈ రెసిపీతో ట్రై చేయండి

వేడి వేడి సేమియా పులావ్.. పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు.. ఈ రెసిపీతో ట్రై చేయండి

కావాల్సినవి
వెర్మిసెల్లి :  ఒక కప్పు
పచ్చి బఠాణీలు: పావుకప్పు
 క్యారెట్ ముక్కలు: పావుకప్పు 
ఉల్లిపాయ (చిన్నది): ఒకటి

టొమాటో (చిన్నది): ఒకటి
పచ్చిమిర్చి: ఒకటి
పసుపు: అరచెంచా

ఇంగువ  : చిటికెడు 
ధనియాల పొడి : అరకప్పు
నిమ్మరసం : ఒక చెంచా
ఆవాలు: అరచెంచా
పల్లీలు : రెండు చెంచాలు

జీడిపప్పు :రెండు చెంచాలు
నీళ్లు : రెండు కప్పులు 
నూనె: తగినంత


తయారీ విధానం: 
స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేయాలి. జీడిపప్పు, పల్లీలను వేయించి పక్కన పెట్టాలి. తర్వాత మరికాస్త నూనె వేసి, వేడెక్కాక వెర్మిసెల్లీ వేయాలి. బంగారు రంగు వచ్చేవరకూ వేయించి తీసేయాలి. అదే గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోయాలి. మరిగాక పచ్చిబఠాణీలు, క్యారెట్ ముక్కలు వేసి మెత్తబడేవరకూ ఉడికించాలి. తరువాత వెర్మిసెల్లీ వేసి, సాఫ్ట్ గా అయ్యేవరకూ ఉడికించాలి (మరీ ఎక్కువసేపు ఉడికిస్తే పేస్ట్ అయిపోతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి). 

►ALSO READ | Health tips : నడుం నొప్పితో నరకం చూస్తున్నారా.. ఈ యోగాసనాలతో రిలాక్స్.. రిలీఫ్..!

స్టవ్ మీద మరో గిన్నె పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేయాలి. చిటపటలాడాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి రంగు మారేవరకూ వేయించాలి. తరువాత ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి... టొమాటో ముక్కలు కూడా వేయాలి. రెండు నిమిషాల తరువాత ఉడికించిన బఠాణీలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి, బాగా కలిపి మూత పెట్టేయాలి. రెండు మూడు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాక వెర్మిసెల్లీ వేసి బాగా కలపాలి. ఒక నిమిషం పాటు మగ్గనిచ్చి, నిమ్మరసం పిండి దించేయాలి.