Health tips : నడుం నొప్పితో నరకం చూస్తున్నారా.. ఈ యోగాసనాలతో రిలాక్స్.. రిలీఫ్..!

Health tips : నడుం నొప్పితో నరకం చూస్తున్నారా.. ఈ యోగాసనాలతో రిలాక్స్.. రిలీఫ్..!

ప్రస్తుత రోజుల్లో జనాలు గంటల కొద్దీ కదలకుండా కూర్చొంటున్నారు.  కొందరు కిలోమీటర్ల కొద్దీ బండ్లు నడిపుతున్నారు.  దీనివలన చాలా మందికి .. కారణాలేవైతేనేం గానీ, నడుము నొప్పి సమస్యతో ఇబ్బంది పడే వాళ్లు ఎక్కువ అయ్యారు.  పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అందరినీ బ్యాక్​ పెయిన్​  గట్టిగానే పట్టుకుంది .దీని నుంచి బయటపడాలంటే కొన్ని యోగాసనాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.. ఎలాంటి యోగాసనాలు చేయాలి.. ఎలా చేయాలి.. అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

సేతు బంధాసనం ( వెన్ను నొప్పి ఉన్న వాళ్ల కోసం)
 

  •  వెల్లకిలా పడుకోవాలి. తరువాత నెమ్మదిగా రెండు మోకాళ్లను మడవాలి. పాదాలను నేల మీద అచ్చాలి. రెండు చేతులను శరీరానికి రెండు వైపులా ఇన్ని అరచేతులు ఆకాశానికి చూస్తున్నట్లు ఉంచాలి. చేతి వేళ్ల కొసలు కాలి మడమలకు ఆనేలా పెట్టాలి..
  •  పాదాలను నేలకు గట్టిగా అదిమి పెట్టి లోపలికి శ్వాస పీలుస్తూ నుంటి భాగాన్ని, వెన్నెముకను నేల మీద నుంచి పైకి లేపాలి
  •  రాతిని పైకి లేపుతూ చేతులను భుజాలనునేల మీద అదమాలి. ఇలా చేస్తున్నప్పుడు కాళ్లు, తుంటి బాగాన్ని నెమ్మదిగా నేల మీద నుంచి పైకి లేపాలి.
  •  తరువాత తుంటి భాగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కాలిని నెమ్మదిగా పైకి లేపాలి.
  •  నాలుగు నుంచి ఎనిమిది సార్లు శ్వాస తీసుకోవాలి. తరువాత నెమ్మదిగా కిందకు దింపాలి. రెండో కాలిని కూడా అలానే పైకి లేపి, నెమ్మదిగా కిందకు దించాలి. 
  • శ్వాస నెమ్మదిగా బయటకు వదులుతూ వీపు నేల మీదకు అన్నాలి

సుప్త మత్స్యేంద్ర ఆసనం

  •  వెల్లకిలా పడుకుని రెండు చేతులను, నేలకి  'టి' పాజిషన్లో లో ఆన్చాలి. అర చేతులు బోర్లా పెట్టాలి. కుడి మోకాలిని వంచి కుడికాలి పాదాన్ని ఎడమ మోకాలి మీద పెట్టాలి.
  •  శ్వాస నెమ్మదిగా బయటకు వదులుతూ కుడి మోకాలిని శరీరం ఎడమ వైపునకు ఉంచాలి. వెన్నెముక, నడుము భాగాన్ని కాస్త పక్కకు వంచాలి. ఈ భంగిమలోకి వచ్చాక మీ చూపు కుడి చేతి వేళ్ల చివర్లు చూడాలి.
  • భుజాలను నేల మీద సమాంతరంగా ఆన్చాలి. కళ్లు మూసుకొని, రిలాక్స్ అవ్వాలి. మోకాలు కిందకు తెచ్చేందుకు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం ఉండదు. సులభంగానే వచ్చేస్తుంది.
  • ఆరు నుంచి పది సార్లు శ్వాస లోపలికి తీసుకుని, బయటకు వదిలే వరకు ఇదే భంగిమలో ఉండాలి.
  • శ్వాస లోపలికి తీసుకుని తుంటిని నేల మీదకు అన్చాలి. కాళ్లను నేల మీద పెడుతున్నప్పుడు శ్వాస బయటకు వదలాలి
  • ఇలానే రెండో వైపు కూడా చేయాలి

సుప్త బంధ కోణాసనం

  •  నేల మీద నిటారుగా పడుకోవాలి. నెమ్మదిగా మోకాళ్లను పైకి మడవాలి. రెండు పాదాలను ఒక దగ్గరకు చేర్చాలి. ఇలా పెట్టినప్పుడు పాదాల చివర్లు నేల మీదకి ఆన్చాలి పిరుదలకు కాలి మడమలు అన్చాలి.
  • అరచేతులు తుంటికి రెండు వైపులా ఉంచి నేలకు అదమాలి.
  • శ్వాస నెమ్మదిగా బయటకు వదలాలి. ఈ ఆసనంలో పొత్తికడుపు మీద ప్రభావం పడుతుంది. నడుము ప్రాంతం సాగినట్టు, వెన్నెముక స్థిరంగా ఉన్న ట్లు అనిపిస్తుంది. ఈ భంగిమలో కాసేపు అలానే ఉండాలి.
  • వెంటనే శ్వాస లోపలికి తీసుకుని బయటకు వదలాలి మోకాళ్లు దూరంగా పెట్టాలి. 
  • ఈ ఆసనం చేసేటప్పుడు వెన్నెముక చివరి భాగం బలవంతంగా వంచకూడదు. భుజాలు వదులుగా ఉండి మెడకు కాస్తదూరంగా పెట్టాలి.
  • ఈ భంగిమలో ఒక నిమిషం ఉండాలి. శ్వాస దీర్ఘంగా లోపలికి తీసుకుని బయటకు వదలాలి. అయితే దీన్ని వేగంగా కాకుండా నెమ్మదిగా చేయాలి.
  • శ్వాస బయటకు వదులుతూ భంగిమ నుంచి బయటకు రావాలి. అయితే దానికంటే ముందు నడుము మోకాళ్లు నేలకు అన్ని శరీరాన్ని సాగదీయాలి. తరువాత మోకాళ్లను శరీరానికి హత్తుకుని ఆసనం నుంచి బయటకు రావాలి.

సేతు బంధాసన

  •  వెల్లకిలా పడుకోవాలి, మోకాళ్లు, వంచి పాదాలను నేల మీద ఆన్చాలి. అర చేతులను నేలకు అన్ని రెండు చేతులను శరీరానికి ఇరువైపులా పెట్టాలి. చేతి వేళ్ళు మడమలను తగలాలి.
  •  పాదాలను నేలకి అదిమి పట్టి శ్వాస లోపలికి పిలుస్తూ తుంటిని పైకి ఎత్తాలి. వెన్నును నేల మీద నుంచి పైకి లేపాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి అనిస్తూ నెమ్మదిగా వత్తాలి...
  • చేతులను, భుజాలను నేలకు నొక్కి పట్టి ఛాతిని నెమ్మదిగా పైకి లేపాలి. నెమ్మదిగా
  • కాళ్లు, తుంటి భాగాన్ని పైకి లేపాలి. నాలుగు మంచి ఎనిమిదిసార్లు శ్వాసించే వరకు అదే భంగిమలో ఉండాలి.
  •  నెమ్మదిగా శ్వాస బయటకు వదులుతూ వెన్నును నేలకు ఆన్చాలి.

వెలుగు, లైఫ్​