ఫైర్ సేఫ్టీ లేదని రాజేంద్రనగర్ లో బిల్డింగ్ సీజ్ చేసిన హైడ్రా

ఫైర్ సేఫ్టీ లేదని  రాజేంద్రనగర్ లో  బిల్డింగ్ సీజ్ చేసిన హైడ్రా

నాంపల్లి అగ్ని ప్రమాదంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రేటర్ వ్యాప్తంగా పలు శాపింగ్ మాల్స్, బిల్డింగ్ లను పరిశీలిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని బల్డింగ్ లను సీజ్ చేస్తున్నారు.

జనవరి 30న  రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 160  దగ్గర  ఫైర్ సేఫ్టీ లోపాలతో ఉన్న  క్రోమా భవనాన్ని  సీజ్ చేసింది హైడ్రా. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో అధికారుల చర్యలు  తీసుకుంటున్నారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా నడుస్తున్న భవనాన్ని హైడ్రా అధికారులు సీజ్ చేశారు. భవనంలో అవసరమైన  ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు, అలారం సిస్టమ్స్ లేకపోవడం గుర్తించారు.

ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.భవన యజమానులు తక్షణమే ఫైర్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయాలని, లోపాలు సరిదిద్దిన తరువాతే భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.