తిరుమల లడ్డూ వివాదంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. తిరుమల లడ్డూ అంశంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన పాపం చంద్రబాబుదేనని అన్నారు.శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు వాడారని ఆరోపించారని.. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని అన్నారు. రెండు జాతీయ ల్యాబ్ రిపోర్టులు చంద్రబాబు ఆరోపణలు అబద్దమని తేల్చాయని అన్నారు సజ్జల.
జగన్ తో పాటు వైసీపీకి నేతలను నిందించడంపైనే తాము ప్రశ్నించామని అన్నారు. టీడీపీ విషప్రచారాన్ని తిప్పికొట్టడానికే తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. తప్పు చేశామని ఒప్పుకునే విచక్షణ చంద్రబాబుకు లేదని అన్నారు. టీడీపీ నేతలు ఇప్పుడు కల్తీ అంటూ మళ్ళీ విషప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు లేక వైసీపీ మీద దాడి చేస్తున్నారని అన్నారు సజ్జల.
చంద్రబాబు హయాంలో ఉన్న హర్ష్ డైరీ తర్వాత భోలేబాబా డైరీగా మారిందని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే టీటీడీ లడ్డూ కల్తీపై అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. కోట్లాది మంది భక్తులను షాక్ కు గురి చేసిన పాపం చంద్రబాబుదే అని అన్నారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకపోగా ఇప్పటికీ అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల. చంద్రబాబును ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు.
