ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంటిని నిర్మించుకొనేటప్పుడు ఏ దిక్కులో ఎంత ఖాళీ స్థలం వదలాలి.. రెండు గదులను ఒకే గది చేసుకోవచ్చా..! మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న:తూర్పు-పడమర దిక్కుల్లో ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టుకోవాలన్నారు. అయితే, ఏ దిక్కు ఎక్కువ స్థలం వదిలి ఇల్లు కట్టుకోవడం మంచిది?
జవాబు: తూర్పు, పడమర దిక్కుల్లో కొంచెం ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టుకోవడం మంచిది. తూర్పు వైపు కొంచెం ఎక్కువ స్థలం.. పడమర వైపు కొంచెం తక్కువ స్థలం వదిలి ఇల్లు కట్టుకోవాలి
ప్రశ్న: నైరుతి వైపు ఉన్న రెండు చిన్న గదులను కలిపి ఒక పెద్ద రూమ్ చేయాలనుకుంటున్నాం. అయితే, పైవైపు ఒక బీమ్ ఉండిపోతుంది? ఇదేమైనా దోషమా? సరిచేయొచ్చా?
జవాబు: బీమ్ ను తీసేయడం కుదరదు. అది కనిపించకూడదనుకుంటే ఫాల్స్ సీలింగ్ చేయించుకోవాలి. దీనివల్ల బీమ్ లోపలికి వెళ్తుంది. బీమ్ కింద పడుకోవడం, కూర్చోవడం వంటివి చేయకూడదు
