దర్జాగా రోడ్డుపై ఇంటి నిర్మాణం ..కూల్చేసిన హైడ్రా  

దర్జాగా రోడ్డుపై ఇంటి నిర్మాణం ..కూల్చేసిన హైడ్రా  

హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్, వెలుగు: 20 అడుగుల రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న ఇంటిని హైడ్రా కూల్చేసింది. సికింద్రాబాద్​న్యూ బోయిగూడలో 50 గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాల మేర రోడ్డుని ఆక్రమించి కింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపు, పైన ఇల్లు కడుతుండడంతో స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తంలో చిన్న డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్బా పెట్టుకుని వ్యాపారం చేసుకుంటే బతుకుతాడని వదిలేశామని, దీంతో ఇప్పుడు రోడ్డు బంద్​చేసి ఏకంగా ఇంటినే కడుతున్నారని కంప్లయింట్​లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైడ్రా అధికారులు రోడ్డును ఆక్రమించి కడుతున్నాడని తేల్చి బుధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం కూల్చేసింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.