V6 News

షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం రూ.10 లక్షల ఆస్తి నష్టం

షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం రూ.10 లక్షల ఆస్తి నష్టం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: షార్ట్​సర్క్యూట్​కారణంగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మైలారం గ్రామానికి చెందిన కాచం లచ్చన్న, భాస్కర్​కుటుంబసభ్యులు పది రోజుల క్రితం హైదరాబాద్​కు వెళ్లారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో షార్ట్ సర్య్కూట్​జరిగి మంటలు చెలరేగాయి. చుట్టుపక్కలవారు గమనించి ఫైర్​స్టేషన్​కు సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.

కానీ అప్పటికే ఇల్లు కాలి బూడిదైంది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఫర్నీచర్, వస్తులు, ఇతర సామాగ్రి కాలిపోయాయి. సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. బాధితులకు జరిగిన నష్టంపై  ప్రభుత్వానికి నివేదికను అందజేసి నష్టపరిహారం అందేలా చూస్తామని ఆర్​ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రామకృష్ణ సందర్శించి వివరాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.