రేషన్‌‌కార్డు అప్లికేషన్లపై  ఇంటింటి ఎంక్వైరీ

రేషన్‌‌కార్డు అప్లికేషన్లపై  ఇంటింటి ఎంక్వైరీ
  • మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు
  • మూడంచెల్లో లబ్ధిదారుల గుర్తింపు
  • ఇప్పటికే స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన అప్లికేషన్ల వడబోత

హైదరాబాద్, వెలుగు: రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల అప్లికేషన్ల క్షేత్ర స్థాయి ఎంక్వైరీ సోమవారం నుంచి మొదలుకానుంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది, గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయనున్నారు. ఇందుకు సంబంధించి సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ నెల 25లోగా ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయాలన్నారు. 4.97 లక్షల అప్లికేషన్లను సిబ్బంది ఎంక్వైరీ చేయనున్నారు.

అర్హులెవరో తేలుస్తున్నరు 
రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లను ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ డేటా సెంటర్ ద్వారా 360 డిగ్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్యూరిఫై చేస్తున్నారు. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల ఆధారంగా అర్హులు కాని వాళ్ల అప్లికేషన్లను రిజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కార్లున్న, రూ. వెయ్యి కన్నా ఎక్కువ కరెంటు బిల్లులు కడుతున్న, సొంత ఇండ్లుంటే ఇంటి వైశాల్యం ప్రకారం, గతంలో కార్డు కోసం అప్లై చేసి తర్వాత కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వారు తదితర వివరాలను 360 డిగ్రీల్లో ప్యూరిఫై చేస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్ష 3 వేల అప్లికేషన్లు ఉండగా ప్యూరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో17 వేలు రిజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో, డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోల లాగిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 86 వేల 130 అప్లికేషన్లు మిగిలినట్లు తెలిసింది. ఇవన్నీ ప్యూరిఫై అయితే దాదాపు 75 వేల వరకు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. 

జిల్లా స్థాయి సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారుల పర్యవేక్షణలో..
రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు సిబ్బంది వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. అప్లై చేసుకున్న వాళ్ల కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని అర్హులను గుర్తించి వాళ్ల సొంత సంతకంతో వివరాలను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తారు. రిజెక్ట్ చేసినా ఆ వెరిఫికేషన్ రిపోర్టును ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపాల్సి ఉంటుంది. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక లాగిన్ ఉంటుంది. అప్లికేషన్లను రివ్యూ చేసుకునేందుకు వివరాలన్నీ అందులో అందుబాటులో ఉంటాయి. ఫీల్డ్ లెవల్ స్టాఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా వచ్చిన డేటాను ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో లేదా తహసీల్దార్ అప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా జిల్లా స్థాయి సివిల్ సప్లయ్స్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఇన్‌‌స్పెక్టర్లు అప్లికేషన్ అప్రూవల్, రిజెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోకు డిజిటల్ టోకెన్ ద్వారా పంపిస్తారు.​ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాక కార్డు పంపిణీ జరుగుతుంది.