
ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి.. ముళ్లు ఉన్న మొక్కలను పెంచుకుంటే నష్టాలుంటాయా...? ప్రహరీ గోడ విషయంలో ఎలాంటి వాస్తు పాటించాలి.. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్న సలహాలను గురించి తెలుసుకుందాం. . !
ప్రశ్న: గార్డెన్ లో ఏ రకమైన మొక్కలు పెంచాలి? ఏ రకమైన మొక్కలు గార్డెన్లో పెంచకూడదు?ముళ్ల చెట్లను పెంచకూడదంటారు నిజమేనా? ఇంట్లో మంచి జరగాలంటే ఏరకమైన మొక్కలు పెంచాలి?...
జవాబు : ఫామ్ హౌజ్ లో ఎలాంటి మొక్కలైనా పెంచుకోవచ్చు. కానీ, ఇంటి డాబాపైన, గార్డెన్ లో పెంచుకునే మొక్కల విషయంలో కొన్ని రూల్స్ పాటిస్తే మంచిది. పండ్లు, పూలు, కూరగాయల చెట్లు పెంచుకోవచ్చు. వాటిలో బొప్పాయి, ములక్కాడ చెట్లు పెంచుకోకపోవడమే మంచిది. అలాగే ముళ్ల చెట్లు కూడా పెంచకూడదు. పెరట్లోని పండ్లు.. పూలు దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది.
ప్రశ్న: ప్రహరీ గేట్ల విషయంలో వాస్తు నియమాలేంటి? ప్రహరీ గోడ, గేట్ల విషయంలో వాస్తు నియమాలేంటి?
జవాబు: ఇంటికే కాదు.. ప్రహరీ గేట్ల విషయంలో కూడా వాస్తు పాటించాలి. నాలుగు వైపులా సమానమైన ఎత్తులో ప్రహరీ కట్టుకోకూడదు. దక్షిణం, పడమర వైపు ఆరు అడుగుల ఎత్తులో... తూర్పు ఉత్తరం దానికంటే ఒకటి లేదా రెండు అడుగులు తక్కువ ఎత్తు ఉండేలా ప్రహరీ కట్టుకోవాలి. దక్షిణ, పడమర వైపు ఎత్తుగా ఉండే ప్రహరీ, తూర్పు, ఉత్తరం వైపు ఎత్తు తక్కువగా ఉండే. ప్రహరీ కట్టుకోవడం మంచిదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.