హైదరాబాద్‌‌‌‌లో ఇండ్ల ధరలు 4.8 శాతం అప్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌లో ఇండ్ల ధరలు 4.8 శాతం అప్‌‌‌‌

న్యూఢిల్లీ:   2024–-25 నాలుగో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో (జనవరి–-మార్చి 2025) టాప్ 50 నగరాల్లోని 48 నగరాల్లో ప్రాపర్టీ ధరలు పెరిగాయని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ పేర్కొంది. హౌరా, తిరువనంతపురంలో మాత్రం ధరలు తగ్గాయని తెలిపింది.  ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌బీ రెసిడెక్స్‌‌‌‌ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ (హెచ్‌‌‌‌పీఐ) ప్రకారం, 50 నగరాల ఇండెక్స్ ఏడాది లెక్కన క్యూ4లో 7.5 శాతం పెరిగింది. 

బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి సేకరించిన ప్రాపర్టీ వాల్యూయేషన్ డేటా ఆధారంగా ఈ వివరాలను ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌బీ బయటపెట్టింది. ఏడాది లెక్కన ఇండ్ల ధరలు  హైదరాబాద్‌‌‌‌లో 4.8 శాతం,  అహ్మదాబాద్‌‌‌‌లో  6.1 శాతం,  బెంగళూరులో 13.1 శాతం, చెన్నైలో  9శాతం, ఢిల్లీలో  2.9 శాతం,  కోల్‌‌‌‌కతాలో 9.6శాతం, ముంబైలో  5.9 శాతం, పూణేలో  6.8 శాతం పెరిగాయి. 

 కిందటేడాడి డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే,   50 నగరాల ఇండెక్స్ ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 1.9 శాతం పెరిగింది.