ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. ఇంటి నిర్మాణం .. మెట్లు ఏ దిశలో ఉండాలి. ఇంటికి రెండు దిక్కులో మెట్లు ఉంటే నష్టం జరుగుతుంది. ఇంట్లొనే ఆఫీసు రూం పెట్టుకోవాలంటే ఏ దిక్కులో ఉన్న గదులను వాడుకోవాలి. మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం..
ప్రశ్న: తూర్పు ముఖద్వారంతో ఇల్లు కట్టుకుంటున్నాం. ఇంటికి రెండువైపులా మెట్లు కట్టుకోవచ్చా? ఏ వైపు ఉంటే బాగుంటుంది?
జవాబు:ఇంటికి రెండు వైపులా మెట్లు కట్టుకోవచ్చు. ఆగ్నేయం, వాయువ్యం.. రెండు దిక్కుల్లో మెట్లు కట్టుకోవాలి. ఉత్తరం నుంచి దక్షిణంవైపు చూస్తూ మెట్లు ఎక్కాలి. లేదా తూర్పు నుంచి పడమరవైపు చూస్తూ మెట్లు ఎక్కాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.
ప్రశ్న: కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇంట్లోనే ఆఫీస్ కోసం ఒక గది వాడుకోవాలనుకుంటున్నాం. ఉత్తర ఈశాన్యం, ఆగ్నేయం దిక్కుల్లో గదులు ఉన్నాయి. వాటిలో ఏవైపు గదిని ఆఫీస్ గా వాడుకుంటే బెటర్? లేదా వేరే ఏ గదినైనా ఆఫీస్ గా మార్చుకోవచ్చా?
జవాబు: రెండు రూమ్ లు ఖాళీగా ఉన్నప్పుడు ఆగ్నేయ రూమ్ ను ఆఫీస్ గా వాడుకోవచ్చు. ఒకవేళ ఈశాన్యం రూమ్ వాడుకోవాలనుకుంటే, ఆగ్నేయ రూమ్ ఖాళీగా ఉంచకూడదు. అప్పుడు రెండు రూమ్లు ఆఫీస్ గా వాడుకోవాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.

