Crime Comedy: రూ.100 కోట్ల క్లబ్‌లోకి లేటెస్ట్ క్రైమ్ కామెడీ.. షిప్లో మర్డర్.. ముగ్గురు అనుమానితులు

Crime Comedy: రూ.100 కోట్ల క్లబ్‌లోకి లేటెస్ట్ క్రైమ్ కామెడీ.. షిప్లో మర్డర్.. ముగ్గురు అనుమానితులు

సక్సెస్ ఫుల్ కామెడీ సీరీస్గా తెరకెక్కిన హౌస్ ఫుల్ సీజన్ 5.. వసూళ్లతో దుమ్మురేపుతోంది. హౌస్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ సీజన్ 5.. నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.101 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. జూన్ 6న రిలీజైన ఈ మూవీ స్లాప్ స్టిక్ కామెడీతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర నిలకడగా కలెక్షన్లు రాబడుతూ సత్తా చాటుతోంది. 

ప్రముఖ ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం.. 

హౌస్ ఫుల్ సీజన్ 5 శుక్రవారం (జూన్ 6) రిలీజయింది. క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే భారీ ఓపెనింగ్ అందుకుంది. దాదాపు రూ.24 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు శనివారం దాదాపు 29 శాతం వృద్ధిని సాధించి రూ.31కోట్లు నెట్ వసూలు చేసింది. మూడో రోజు (ఆదివారం) రెస్పాన్స్ మరింతగా పెరిగి రూ.32.5 కోట్ల నెట్ వసూళ్లతో దూకుడు కనబరిచింది.

ఇక నాలుగో రోజైన సోమవారం సాయంత్రం షోలలో మంచి అక్యుపెన్సీ నమోదు చేసుకుని, రూ.13.50 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా నాలుగు రోజుల్లో..అంటే సోమవారం రాత్రికి రూ.100 కోట్ల నెట్ మార్కును దాటి శభాష్ అనిపించుకుంది.

ఇప్పుడీ ఈ మూవీ అక్షయ్ నటించిన లాస్ట్ మూవీ కేసరి చాప్టర్ 2 ఇండియా నెట్ వసూళ్లను అధిగమించింది. కేసరి చాప్టర్ 2 ఇండియాలో రూ.92.53 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇదే జోరు హౌస్‌ఫుల్ 5 కంటిన్యూ చేస్తే.. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ రూ.149 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

తరుణ్ మన్సుఖానీ డైరెక్ట్ చేసిన హౌస్ ఫుల్ 5 కామెడీ, థ్రిల్లింగ్, సస్పెన్స్, మిస్టరీతో తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్, జాన్ అబ్రహామ్, బాబీ డియోల్ పెద్ద స్టార్స్ నటించారు. పూజా హెగ్డే, కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫిమేల్ లీడ్స్‌‌‌‌‌‌‌‌గా కనిపించి ఆకట్టుకున్నారు. 

స్టోరీ విషయానికి వస్తే.. 

ఓ పెద్ద క్రూయిజ్ షిప్ లో రిచెస్ట్ పర్సన్ మర్డర్ చుట్టూ తిరిగే కథ ఇది. కన్ఫూజన్ క్యారెక్టర్స్, సస్పెన్స్, మిస్టరీ, కామెడీ ఇలా.. ఆడియెన్స్ ను థ్రిల్ చేసే విధంగా సాగింది. ఒక పారిశ్రామికవేత్త హత్యలో ముగ్గురు వ్యక్తులు అనుమానితులుగా ఉంటారు. ఆస్తి కొట్టేయడానికి జాలీ అనే పేర్లతో వచ్చిన వీళ్లు.. చివరకు మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. వీళ్లలో హత్య చేసింది ఎవరనేది ఛేదించడానికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు వస్తారు. ఆ తర్వాత ఒక్కో క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం, అందులో ప్రతి పాత్ర వెనుక ఒక ముసుగు ఉండటం ఆసక్తి కలిగిస్తుంది. మరి ఆ మర్డర్ ఎవరు చేశారు? అదేలా కనిపెట్టారు? చివరికి ఎవరు ఇరుక్కున్నారు? అనేది మిగతా స్టోరీ.